‘అలీతో సరదాగా’ షో సీక్రెట్స్.. గెస్టులకు అంత ఇస్తారా?

Authored By Cinema Desk | The Telugu News | Updated on: March 31, 2021, 8:46 pm

Ali tho saradaga show : బుల్లితెరపై అలీతో సరదాగా షో సక్సెస్ అయినట్టుగా, దానికి వచ్చిన మంచి గుర్తింపు మరో షోకు రాలేదు. గతంలోని విషయాలు, అందరూ మరిచిపోయిన సెలెబ్రిటీలను పట్టుకుని నేటి తరం ప్రేక్షకులకు పరిచయం చేస్తుంటారు. అంతే కాకుండా నాటి తరం సెలెబ్రిటీలు నేడు ఎలాంటి కష్టాలు పడుతున్నారు.. ఎలా జీవిస్తున్నారు.. ఇప్పుడు ఎలా జీవిస్తున్నారనే విషయాలను అందరికీ చూపిస్తుంటారు. అలా ఎంతో ఎమోషనల్‌గా షోను రక్తి కట్టిస్తుంటారు.

అలా అలీతో సరదాగా షోకు ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు ఉంటుంది. అందుకే ఈ షోకు పిలిస్తే వెంటనే వచ్చేస్తుంటారు. షోలో కూడా అదే విషయాన్ని చెబుతుంటారు. అలీ హోస్ట్ కాబట్టే ఇక్కడకు వచ్చామని, అది అలీతో సరదాగా షో కాబట్టే వచ్చామని చెబుతుంటారు. అలాంటి ఘనత ఒక్క అలీతో సరదాగా షోకే వచ్చింది. అయితే ఇందులో బయటకు తెలియని విషయాలెన్నో ఉన్నాయి. గెస్ట్‌లు వచ్చే సెలెబ్రిటీలకు ఎంత ఇస్తారు.. రెమ్యూనరేషన్ ఎంత.. విధివిధనాలేంటని విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Ali tho saradaga show behinds secrets

Ali tho saradaga show behinds secrets

Ali tho saradaga show : ‘అలీతో సరదాగా’ షో సీక్రెట్స్.. ఒక్కొక్కరి అంత ఇస్తారా?

అలీతో సరదాగా షోకు వచ్చే అతిథులకు ఎపిసోడ్‌కు లక్ష రూపాయలు ఇస్తారని తెలుస్తుంది. రేంజ్‌ను బట్టి వాళ్లకు ఫ్లైట్ టికెట్.. హోటల్ ఖర్చులు అదనం. ప్రత్యేకంగా వాళ్లను తీసుకొచ్చి షో పూర్తయ్యే వరకు జాగ్రత్తగా చూసుకుని పంపిస్తారు. వీళ్లు వాళ్లు అనే తేడా లేకుండా అందరికీ ఎపిసోడ్‌కు లక్ష వరకు ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మధ్య మాత్రం సినిమా ప్రమోషన్స్‌ కోసం గెస్ట్‌లను తీసుకొస్తుండటంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp