Ali Remuneration : అలీ తో సరదాగా టాక్ షో కి అలీ తీసుకునే పారితోషికం ఎంతో తెలిస్తే నోరు వెళ్లబెడతారు!
Ali Remuneration : ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా టాక్ షో కి ఒక వర్గం ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఈటీవీలో అలీ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న ఆలీతో జాలీగా అనే గేమ్ షో గతంలో అలీ చేసేవారు. ఇప్పుడు ఆలీతో సరదాగా టాక్ షో చేస్తున్నారు. వందల కొద్దీ ఎపిసోడ్లు పూర్తవుతున్నాయి. ఆలీ నటుడిగా ఎంతో బిజీగా ఉంటారు, ఒకే సారి ఐదు నుండి పది సినిమాలు చేస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి అలీ ఈ టాక్ షో కి ఓకే చెప్పడానికి కారణం ఏంటి అనేది అందరికీ ఆసక్తిని కలిగించే విషయం. వెండి తెర పై నటించినా కూడా బుల్లి తెరపై కనిపించడం అనేది తనకు ఆసక్తి అంటూ గతంలో ఆలీ చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ కి చెందిన తనకు ఇష్టమైన ఒక వ్యక్తి బుల్లి తెరపై కనిపిస్తుంటాడు.. అందుకే తాను కూడా బుల్లి తెరపై కనిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను కమిట్ అయ్యాడు అనేది ప్రచారం. ఆ విషయాన్ని పక్కన పెడితే ఆలీ ప్రస్తుతం చేస్తున్న ఆలీతో సరదాగా టాక్ షో ఒక్కో ఎపిసోడ్ కి ఎంత పారితోషికం తీసుకుంటారు అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఒక్క ఎపిసోడ్ ను ఆయన మూడు నుండి నాలుగు గంటల పూర్తి చేస్తారు.. కనుక ఆయనకు పారితోషికం భారీ మొత్తంలో ఏమీ ఉండదు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం 6.50 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఆలీ ఒక్కో ఎపిసోడ్ కి తీసుకుంటారట.
అందులో టాక్స్ లు పోగ తన పర్సనల్ స్టాఫ్ కి ఖర్చులు ఇవ్వగా ఐదు లక్షలకు కాస్త అటు ఇటుగా మిగులుతుందట. నెలలో మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే అలీ ఈ కార్యక్రమానికి కేటాయిస్తాడు.. నెలలో 20 లక్షల రూపాయల వరకు అలీ ఈ కార్యక్రమం ద్వారా దక్కించుకుంటాడు. ఇది సామాన్యులకు చాలా పెద్ద అమౌంట్ కానీ అలీ వంటి స్టార్స్ కి చిన్న అమౌంట్. అయినా కూడా తనకు సెల్ఫ్ సంతృప్తిని కావాలనే ఉద్దేశంతో ఆలీతో సరదాగా చేస్తున్నట్లుగా ఆయన అంటూ ఉంటాడు. సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న ఈ కార్యక్రమం మరింత సుదీర్ఘ కాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.