regina cassandra రెజీనా కసాండ్ర .. ఇండస్ట్రీ లో ఎనిమిదేళ్ళ అనుభవం ఉన్న అందాల సుందరి. మెగా హీరోలకి పర్‌ఫెక్ట్ జోడీ అన్న పేరు తెచ్చుకున్న రెజీనా కసాండ్ర కు ఇప్పటికీ చెప్పుకోదగ్గ అవకాశాలు లేవన్న సంగతి తెలిసిందే. నటనా నైపుణ్యం ఉన్నా, అందాల ఆరబోతకు వెనకడుగు వేయకపోయిన అమ్మడి స్టార్ తిరగలేదు. ఇండస్ట్రీ లో ఉన్న ఆల్మోస్ట్ యువ హీరోలతో జతకట్టి తెరపై తళుక్కుమన్న రెజీనా కు స్టార్ హీరోయిన్ అయ్యే మ్యాటర్ ఉన్నా అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే అని చెప్పాలి. అందులోనూ ఈ మధ్య కాలంలో సినీ అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు.
all producers will be in queue if they listens rejina kasandra words
యంగ్ హీరో అడవి శేష్ నటించిన ఎవరు తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. దీనితో రెజీనా ఫేడ్ అవుట్ అయ్యిందని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. ఇక మళ్లీ తెరపై కనిపించదు అని అనుకున్నారు. కానీ అందరికీ షాక్ ఇస్తూ కంబ్యాక్ ఇస్తోంది రేజీనా. నేనేనా? అనే మూవీ తో తానేంటో చూపించేందుకు రెడీ అవుతోంది. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ తో మంచి క్రేజ్ ను పొందాలని ప్లాన్ చేస్తోంది. అయితే కెరీర్ ప్రారంభంలో తాను చేసిన పొరపాట్ల గురించి ఇటీవల బయట పెట్టింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చానని.. రెజీనా కసాండ్ర ప్రారంభంలో ఇండస్ట్రీ పై సరైన క్లారిటీ లేదని తెలిపింది.
ఇండస్ట్రీ లో ఎన్నో రూల్స్ ఉంటాయని అందరూ అవే ఫాలో అవుతారని చెప్పింది. అయితే తాను మాత్రం అందరికంటే భిన్నంగా ఉంటాని అని తెలిపింది. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే ఏ విషయమైనా సహించలేనని అంటోంది. కథ తనకు నచ్చితే ఓకే చేస్తానని.. మంచి కథల కోసం వేయిట్ చేస్తున్నట్టు తెలిపింది. ఒకరకంగా మేకర్స్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. రెజీనా చెప్పిన ఈ మాటలు కనుక నిర్మాతలందరూ వింటే రెజీనా వెనుకే క్యూ కడతారు. అసలే రెజీనా అవకాశాల కోసం ఆతృతగా ఉంది. నిర్మాతలకి ఇప్పుడు కావాల్సింది కాస్త ఫేం ఉండి రెమ్యూనరేషన్ డిమాండ్ చేయని హీరోయిన్సే.ఇక రెజీనా కెరీర్ లో ది బెస్ట్ గా చెప్పుకునే అవకాశం అంటే మెగాస్టార్ ఆచార్య సినిమా. ఈ సినిమాలో రెజీనా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి స్పెషల్ సాంగ్ చేసే అవకాశం దక్కించుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిన మెగాస్టార్ తో పాటు చిత్ర యూనిట్ ని పొగడ్తలు కురిపించుకుంది.
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.