Allu Aravind : అల్లు అరవింద్ మామూలోడు కాదు .. ఆ హీరోయిన్ తో కలిసి డాన్స్ ఇరగదీసేశాడు .. వైరల్ వీడియో …!!

 Authored By prabhas | The Telugu News | Updated on :25 December 2022,9:20 pm

Allu Aravind : తెలుగు పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్లలో ఒకరు అల్లు అరవింద్. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. అయితే అల్లు అరవింద్ సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ లేటెస్ట్ సినిమా ‘ 18 పేజెస్ ‘ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో నిఖిల్ కి జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. అలాగే ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించారు.

డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. సినిమా సక్సెస్ అయినందుకు నిఖిల్ అనుపమలతో పాటు చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు అభిమానులు. తాజాగా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుపుకుంది చిత్ర యూనిట్. ఇక పార్టీలో డైరెక్టర్ సుకుమార్, స్టార్ ప్రొడ్యూసర్ అల్లుఅరవింద్ లు కూడా పాల్గొన్నారు. ఈ పార్టీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్

Allu Aravind dance with Anupama parameswaran

Allu Aravind dance with Anupama parameswaran

టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు అనే పాటకు అనుపమతో కలిసి డాన్స్ చేశారు. వీళ్ళతోపాటు డైరెక్టర్ సుకుమార్ కూడా డాన్స్ చేశారు. వీళ్ల ముగ్గురు కలిసి నవ్వుతూ డాన్స్ చేస్తుండగా హీరో నిఖిల్ సెల్ఫీ వీడియో తీశారు. ఈ వీడియోను నిఖిల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. బన్నీ వాసు నిర్మించగా.. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి