Allu Aravind : పెట్టింది ఎంత.. వచ్చింది ఎంత.. రాత్రికి రాత్రి కాంతరతో అల్లు అరవింద్ సంపాదించిన అమౌంట్ ఇదే !
Allu Aravind : టాలీవుడ్ లోనే బడా నిర్మాతల్లో ఒకరు అల్లు అరవింద్. ఆయన భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుంటారు. గీతా ఆర్ట్స్ పేరుతో అల్లు అరవింద్ సినిమాలు తీస్తుంటారు. కొన్ని వేరే భాషల సినిమాలను కూడా తీసుకొని గీతా ఆర్ట్స్ ద్వారా ఆ సినిమాలను తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తుంటారు. అలా వేరే భాషల సినిమాలు తెలుగులో డబ్ చేసినప్పుడు కొన్ని సినిమాలు తెలుగులోనూ సూపర్ డూపర్ హిట్ అవుతాయి. అటువంటి సినిమాలు నిర్మాతలకు కోట్లు సంపాదించి పెడతాయి.
అలా.. కాంతార సినిమా కూడా కన్నడతో పాటు డబ్ అయిన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. అసలు ఆ సినిమాలో హీరో ఎవరు? డైరెక్టర్ ఎవరు? హీరోయిన్ ఎవరు? అవేవీ తెలియకుండానే సినిమా టాక్ బాగుందని తెలియగానే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సినిమాను తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ చేశారు. తెలుగులో కాంతార హక్కులను కొన్నది నిర్మాత అల్లు అరవిందే. అందుకే ఆయనకు భారీ ఎత్తున ఈ సినిమా వల్ల లాభాలు వచ్చాయట. కాంతార సినిమా రైట్స్ ను రూ.2 కోట్లకు మాత్రమే అరవింద్ కొన్నారట.

Allu Aravind gets huge profits with kantara movie
Allu Aravind : కాంతార తెలుగు హక్కులను కొన్న నిర్మాత అల్లు అరవింద్
కానీ.. ఆ సినిమా లాభాలు చూసి అందరూ షాక్ అయ్యారట. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా తెలుగులో ఇప్పటి వరకు రూ.16 కోట్లు కలెక్ట్ చేసిందట. దీంతో నిర్మాత అల్లు అరవింద్ తో పాటు బయ్యర్లకు కూడా పంట పండినట్టు అయింది. అంటే.. అల్లు అరవింద్ పెట్టిన మొత్తానికి ఐదారు రెట్ల డబ్బులు ఇప్పటికే వచ్చేశాయి. ఇంకా ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సక్సెస్ గా దూసుకుపోతోంది. ఈ సినిమాను కేవలం రూ.16 కోట్లతో రూపొందించారట. కర్ణాటకలో 80 కోట్ల మైలురాయికి చేరుకుంది ఈ సినిమా. త్వరలోనే అన్ని భాషల్లో కలిపి రూ.150 కోట్ల కలెక్షన్లకు చేరుకుంటుందని అంచనా.