Allu Aravind : సురేష్ కొండేటికి క్షమాపణ చెప్పిన అల్లు అరవింద్.. !!
ప్రధానాంశాలు:
Allu Aravind : సురేష్ కొండేటికి క్షమాపణ చెప్పిన అల్లు అరవింద్.. !!
Allu Aravind : ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరైన బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘ కస్టడీ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ‘ దూత ‘ అనే వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న సరైన హిట్ పడలేదని చెప్పాలి. ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘ తండేల్ ‘ అనే సినిమా చేస్తున్నారు. చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ రోజు ఈ సినిమా పూజ లాంఛనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదటి షూట్ ను చిత్రీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ పాల్గొన్నారు. సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసిన సందర్భంగా అల్లు అరవింద్ మీడియాతో ముచ్చటించారు. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు.
ఈ సినిమాని ఏడాది నుంచి అనుకుంటున్నాం. ఈరోజు పూజ దాకా వచ్చింది. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా చూపించాలని డైరెక్టర్, హీరో చాలా కష్టపడ్డారు. ఇక హీరోయిన్గా మా బంగారు తల్లి సాయి పల్లవి ని తీసుకున్నాం. మొదటగా ఈ కథ చెప్పినప్పుడు తను చాలా ఎక్సైట్ అయ్యి చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు సినిమాలన్నీ చాలా పెద్దవిగా చూడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఈ సినిమాను కూడా పెద్దగా తీసి అన్ని భాషలలో తీయాలి అనుకుంటున్నాం. ఆల్ ఇండియా సౌండ్ కి దేవి శ్రీ ప్రసాద్ కరెక్ట్ అని ఆయనను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకున్నాం. అత్యద్భుతంగా తీసే కెమెరామెన్ శ్యామ్ గారు సినిమాకు దొరికారు. ఈ సినిమా మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత సాయి పల్లవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లవ్ స్టోరీ తర్వాత చైతు, సాయి పల్లవి కలిసి రెండోసారి నటిస్తున్నారు.
కార్తికేయ 2 సినిమాతో మంచి సేమ్ తెచ్చుకున్న చందు మొండేటి ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు. 2018లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్‍కు వెళ్లారు. పాకిస్థాన్ దళాలు వారిని పట్టుకొని బంధించాయి. వారు పాకిస్థాన్‍లోని జైలులో ఉండగా విడిపించేందుకు భారత ప్రభుత్వం కృషి చేసింది. పాక్‍తో చర్చలు జరిపింది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పాకిస్థాన్ ఆ జాలర్లను విడుదల చేసింది. ఈ యథార్థ ఘటనల ఆధారంగానే తండేల్ మూవీ రూపొందనుంది. మత్స్యకారుడిగా నాగ చైతన్య నటించనున్నారు. తండేల్ అంటే నాయకుడు, బోట్‍కు కెప్టెన్ అనే అర్థం కూడా వస్తుందని ఇటీవలే డైరెక్టర్ స్పష్టత ఇచ్చారు.