Allu Arjun : అవమానాల నుండి నేషనల్ అవార్డు వరకు .. అల్లు అర్జున్ బయోగ్రఫీ !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Allu Arjun : అవమానాల నుండి నేషనల్ అవార్డు వరకు .. అల్లు అర్జున్ బయోగ్రఫీ !!

Allu Arjun : టాలీవుడ్ అగ్ర నటుల్లో అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు, హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనువడు, మెగాస్టార్ చిరంజీవి అల్లుడుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. పెద్ద బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన సొంత టాలెంట్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ‘ గంగోత్రి ‘ సినిమాతో హీరో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను […]

 Authored By aruna | The Telugu News | Updated on :27 August 2023,9:00 am

Allu Arjun : టాలీవుడ్ అగ్ర నటుల్లో అల్లు అర్జున్ ఒకరు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకు, హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనువడు, మెగాస్టార్ చిరంజీవి అల్లుడుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. పెద్ద బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన సొంత టాలెంట్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ‘ గంగోత్రి ‘ సినిమాతో హీరో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు.

పేడ మొహం అన్న అవహేళన నుంచి మాస్ మసాలా హీరో కితాబు వరకి స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ నుంచి ఉత్తమ నటుడిగా ఎదిగాడు అల్లు అర్జున్. 1982 ఏప్రిల్ 8న జన్మించారు అల్లు అర్జున్. ఇంట్లో అతడిని అందరూ ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారు. సినీ ఫ్యామిలీ కావడంతో చిన్నప్పటినుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో డ్యాన్సు బాగా నేర్చుకున్నాడు. ఫ్యామిలీ ఫంక్షన్ ఏదైనా బన్నీ స్టెప్స్ తప్పనిసరి. ఇలా 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సినీ రంగంలోకి ప్రవేశించాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ డాడీ ‘ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు.

Allu Arjun Biography

Allu Arjun Biography

ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘ గంగోత్రి ‘ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్బస్టర్ హిట్ అయింది. అయితే అల్లు అర్జున్ గ్లామర్ పై తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లకి కొద్ది సమయం లోనే సమాధానం ఇచ్చాడు. ఆర్య సినిమాతో తనేంటో నిరూపించుకున్నాడు. 2005లో ‘ బన్నీ ‘ , 2007లో ‘ దేశముదురు ‘ 2008లో వచ్చిన ‘ పరుగు ‘ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. 2009లో ‘ ఆర్య 2 ‘ సినిమా ఫ్లాప్ అయినా అల్లు అర్జున్ నటనకు, డాన్స్ కు గుర్తింపు వచ్చింది. జులాయి, రేసుగుర్రం సినిమాలు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. పాన్ ఇండియా సినిమా ‘ వేదం ‘ సినిమాలో కేబుల్ రాజుగా సామాన్యుడిగా, ఇద్దరమ్మాయిలకు లవర్ గా అలరించాడు అల్లు అర్జున్.

‘ రుద్రమదేవి ‘ సినిమాలో సపోర్టింగ్ పాత్రలో తెలంగాణ యాసతో ప్రేక్షకులను అబ్బురపరిచాడు. సరైనోడు, డీజే సినిమాలు బన్నీ కెరీర్ లో మైలురాయిగా నిలిచాయి. ఆర్మీ జవానుగా ‘ నా పేరు సూర్య , నా ఇల్లు ఇండియా ‘ సినిమాతో ప్రశంసలు అందుకున్నాడు. ‘ అలవైకుంఠపురంలో ‘ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగ రాశాడు. 200 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేశారు. తరువాత వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు. ఇప్పుడు దేశమంతటా పుష్ప పార్ట్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోట్ల మంది అభిమానులను సంపాదించుకోవడం వెనుక అల్లు అర్జున్ కష్టం చాలానే ఉంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది