Allu Arjun : TTN స్పెషల్.. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ ఆర్టికల్ !
Allu Arjun : అల్లు అర్జున్ ‘ గంగోత్రి ‘ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఫుల్ పాపులర్ అయ్యాడు. మొన్నటిదాకా స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారాడు. గంగోత్రి సినిమాలో కనిపించిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకున్నాడు. కొత్త కథలు కొత్త పాత్రలతో అల్లు అర్జున్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. మొదటగా లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులకు దగ్గరైన అల్లు అర్జున్ ఆ తర్వాత కమర్షియల్ స్టార్ గా ఎదిగాడు. బన్నీ సినిమాతో అల్లు అర్జున్ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో
అల్లు అర్జున్ నా బన్నీ అని కూడా పిలుస్తు ఉంటారు.ఇక ‘ సరైనోడు ‘ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడు. సుకుమార్, అల్లుఅర్జున్ కాంబినేషన్ లో సినిమా అంటే చాలు అభిమానులు పండగ చేసుకుంటారు. ఆర్యతో మొదలైన వీరి కాంబినేషన్ పుష్ప దాకా వచ్చింది. ఇప్పుడు పార్ట్ 2 కూడా కొనసాగుతుంది. అంతకుముందు కేవలం తెలుగు ప్రేక్షకులకే సుపరిచితమైన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. పుష్ప 2 తో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరుగుతుంది అని చెప్పవచ్చు.
గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ ని చూసి ఇతను హీరో ఏంటి అన్నవారే ఇప్పుడు అతను చేస్తున్న సినిమాలు అందుకుంటున్న సక్సెస్లను చూసి ఇతనే హీరో అంటే అనేలా చేసుకున్నాడు. సినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడతాడు. అందుకే అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా సత్తా చాటుతున్నాడు. పుష్ప సినిమాతో తనేంటో చూపించిన అల్లు అర్జున్ పుష్ప టు తో మరోసారి బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయమన్నాడు. ఇలాంటి గొప్ప సినిమాలు ఎన్నో చేసి తెలుగు సినిమా ఇండియన్ సినిమాకు ఎన్నో పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటూ అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది TTN.