pushpa : ఓ మై గాడ్… పుష్ప ఫ్లాప్ అయితే నా చావు చూస్తారంటూ ఫ్యాన్ హెచ్చరికలు…. వైరల్ ట్వీట్స్..!
pushpa : ప్రపంచంలో ప్రతీ వ్యక్తికి అభిమానులు ఉండవచ్చు. నటుడి పట్లో, గాయకుల పట్లో, చిత్రకారుల పట్లో, శిల్పుల పట్లో, ఉపన్యాసకుల పట్లో రాజకీయ నాయకుల పట్లో వీరాభిమానం చూపించేవారు ఎందరో ఉన్నారు. సినీ హీరోల్ని అభిమానులు అభిమానించటం కొత్తేం కాదు. అది ముదిరి కాస్త ఓవర్ గా అయితేనే అసలు ప్రాబ్లం. తాజాగా పుష్ప సినిమాకు సంబంధించి ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. మూవీపై ఆశగా ఎదురు చూశాడో, లేక బన్నీ పై వీరాభిమానం పెంచుకున్నాడో గానీ పుష్ప ట్రైలర్ చూసి అతను చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.అల్లు అర్జున్ హర్డ్ కోర్ ఫ్యాన్ సోషల్ మీడియాలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. దేవుడు మరియు అమ్మ సాక్షిగా చెప్తున్నా…
పుష్ప మూవీ ఏదైనా తేడా కొడితే రిలీజ్ రోజునే నా చావు చూస్తారు అంటూ అల్లు అర్జున్ వీరాభిమాని చేసిన ట్వీట్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. పుష్ప ట్రైలర్ విడుదల అనంతరం జరిగిన ఈ పరిణామం చూస్తూ ఉంటే అభిమాని ఓ రేంజ్ లో హార్ట్ అయ్యాడని అతని పాత పోస్టులు చూస్తే అర్ధం అవుతోంది. ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయింది… ఇంకా నా వల్ల కాదు… ఇన్ని రోజులు చాలా గౌరవం ఇచ్చి సుకుమార్ పైన ట్వీట్స్ వేశాను… గుడ్ బై ట్విట్టర్… లవ్ యు అల్లు అర్జున్…. అంటూ అతను వేసిన ట్వీట్ చూస్తూ ఉంటే సినిమాపై అతడికి ఇన్ని రోజులు ఉన్న నమ్మకం పోయిందా అని అనిపించక మానదు. అయితే మూవీ గురించి కాసేపు పక్కన పెడితే… ఈ ట్వీట్ పట్ల ఒక్కో వ్యక్తి ఒక్కోలా స్పందిస్తున్నారు.

allu arjun fan warning tweets going viral in social media over pushpa movie
pushpa : లీజ్ రోజే నా చావు చూస్తారంటూ వార్నింగ్స్..:
సినీ హీరోలకు అభిమానులు ఉండటంలో తప్పు లేదు గానీ అది ఈ ఈ రేంజ్ లో ఉండటమే పెద్ద తప్పు అని అంటున్నారు పలువురు. సినిమాను సినిమాగా మాత్రమే చూడాలని అంటున్నారు. పుష్ప హిట్ అవ్వవచ్చు… కాకపోవచ్చు. అందరి హీరోలకు హిట్ లు ఉంటాయి… ప్లాప్ లు ఉంటాయి… అంత మాత్రాన ఇలా చచ్చిపోతాను అని అభిమాని అనటం అతని మూర్ఖత్వమే అని అంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఇతగాడు చేసిన ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతూ సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందన దక్కించుకుంటుండగా… సినిమా హిట్ ప్లాప్ విషయంలో అల్లు అభిమానుల్లో మాత్రం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది.