Allu Arjun : పుష్ప2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కు వెళ్లి తొక్కిసలాటకు, ఓ మహిళ మృతికి కారకులయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్. అయితే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో దానిపై తెలంగాణ హైకోర్టుకు వెళ్లి మధ్యంతర బెయిల్ తెచ్చుకున్న అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. అదే సమయంలో నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు.
సంధ్య థియేటర్ ఘటన తర్వాత చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను ఏ11గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. అయితే ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు నాలుగువారాల మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ కు ఊరట లభించింది. రూ. 50 వేల రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. రిమాండ్ ముగిసిన నేపథ్యంలో ఇటీవల జరిగిన కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు.
అదే రోజున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్ వేయగా, కోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. Allu Arjun కి రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు.. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వెల్లడించారు.
Highest Paid Employee : ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగి మన భారత సంతతి వ్యక్తే. భారతీయ సంతతికి…
OYO : పెళ్లికాని జంటలకు ఇకపై రూమ్స్ బుకింగ్స్ లేవంటూ ఓయో తేల్చిచెప్పింది. ఈ మేరకు చెక్ ఇన్ పాలసీలో…
AP : రాష్ట్రవ్యాప్తంగా 5 నుంచి 15 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులకు 90,000 కళ్లద్దాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని…
Pensioners : 68 లక్షల మంది పెన్షన్ హోల్డర్‌లకు ప్రయోజనం చేకూర్చుతూ, రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ EPFO (ఉద్యోగుల భవిష్య…
Chandrababu : శ్రీకాకుళం జిల్లాకు చెందిన కింజరాపు కుటుంబానికి చంద్రబాబు నాయుడు సర్కార్ గిఫ్ట్ అందించింది. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు…
Sankranthi Holidays : ఎంతగానో ఎదురుచూస్తున్న సంక్రాంతి సెలవుల తేదీలు ప్రకటించబడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం భోగి (జనవరి 13) మరియు…
Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం 2025ని ప్రారంభించింది. రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరమైన…
Raja Yoga : నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలోనే గ్రహాలు కదలికల కారణంగా అందరి జీవితంలో…
This website uses cookies.