allu arjun help for prabhas
Allu Arjun : తెలుగు చలనచిత్ర రంగంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ మినహా వేరే హీరోల విషయంలో ఎక్కువగా ఇష్టపడే హీరో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. తన సినిమా ఎంత హిట్ అవ్వాలని కోరుకుంటాడో అదే సమయంలో ప్రభాస్ సినిమా కూడా విజయం సాధించాలని బన్నీ ఆరాటపడుతుంటాడు. వారిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. ఇదిలా ఉంటే ప్రభాస్ కొత్త సినిమా “ఆదిపురుష్” జూన్ 16వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించడం జరిగింది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే అదే రోజు అల్లు అర్జున్ హైదరాబాద్ అమీర్ పేట్ లో నిర్మించిన మల్టీప్లెక్స్ థియేటర్ ఓపెన్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమాకి లాభాలు తెచ్చే రీతిలో “ఆదిపురుష్” కి అదనపు గ్రాస్ వచ్చే విధంగా బన్నీ ప్లాన్ చేయడం జరిగిందంట.
allu arjun help for prabhas
ఇదిలా ఉంటే రామ్ చరణ్, రణబీర్ కపూర్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాకి సంబంధించి ఒక్కొక్కళ్ళు 10000 టికెట్లు అనాధ పిల్లలకు ఫ్రీగా పంచిపెట్టి చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు. రామాయణం నేపథ్యంలో లేటెస్ట్ టెక్నాలజీతో తెరకెక్కిన సినిమా కావటంతో ప్రస్తుత తరానికి “ఆదిపురుష్” తో శ్రీరాముని చరిత్ర తెలుసుకునే విధంగా సెలబ్రిటీలు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
This website uses cookies.