YS Jagan : ఏపీ రాజకీయాలు ఒక ఎత్తు అయితే.. నెల్లూరు రాజకీయాలు మరో ఎత్తు. నెల్లూరు కేంద్రంగా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అందరి దృష్టి అటువైపే మళ్లుతోంది. నిజానికి నెల్లూరులో కంచుకోట అయిన వైసీపీని దెబ్బ తీయాలని టీడీపీ వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు. వైసీపీ వాళ్లను సస్పెండ్ చేసింది. దీంతో టీడీపీలో చేరేందుకు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవాలి.
నెల్లూరులో లోకేశ్ యాత్ర ప్రారంభం కావడంతో వాళ్లంతా టీడీపీ యువనేత యాత్రలో పాల్గొంటున్నారు. దీంతో వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదు.. అనర్హత వేయాలి అంటున్నారు. లేదా వాళ్లు రాజీనామా చేసి టీడీపీలో చేరాలి అనే డిమాండ్లు మొదలయ్యాయి. మరి.. వైసీపీ ఏం చేస్తుంది. వాళ్లపై అనర్హత వేటు వేస్తుందా? లేక వాళ్లంతట వాళ్లే రాజీనామా చేస్తారా అనేది అంతుపట్టడం లేదు.నిజానికి.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అధికారికంగానే టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టీడీపీ నేతలు కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి వెళ్లారు.
అక్కడ పార్టీలోకి రావాలంటూ వాళ్లను ఆహ్వానించారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా నారా లోకేశ్ ను కలిసి పాదయాత్రకు తన సంఘీభావం ప్రకటించారు. ముగ్గురు నేతలు లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేయాలని తెగ ఆరాట పడుతున్నారు. అంతేకాదు.. ఆయన పాదయాత్ర పూర్తవగానే టీడీపీలో చేరేందుకు వాళ్లు సుముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి వాళ్లు ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలే. కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కానీ.. నైతికంగా వాళ్లు వైసీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. ఈనేపథ్యంలో వాళ్లు తమ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా లోకేష్ పాదయాత్రలో పాల్గొంటే వైసీపీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.