Allu Arjun : అల్లు అర్జున్ చేసిన ప‌నికి ఇద్ద‌రు కానిస్టేబుల్స్‌పై వేటు ప‌డింది.. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : అల్లు అర్జున్ చేసిన ప‌నికి ఇద్ద‌రు కానిస్టేబుల్స్‌పై వేటు ప‌డింది.. !

 Authored By ramu | The Telugu News | Updated on :26 May 2024,3:00 pm

Allu Arjun : పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప‌2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే షూటింగ్స్‌తో అంత బిజీగా ఉన్న బ‌న్నీ త‌న ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో పర్యటించారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి, తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ ఈ నెల 11న తన భార్యతో కలిసి నంద్యాల వెళ్లారు.నంద్యాల వెళ్లి మరీ ఆయనకు అల్లు అర్జున్ తన మద్దతు ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్పా రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో శిల్పా రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిసిపోయింది.

Allu Arjun : బ‌న్నీ వ‌ల‌న ఆ ఇద్ద‌రు బుక్

ముందస్తు అనుమతి లేదన్న కారణంగా అల్లు అర్జున్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిపై ఇప్ప‌టికే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడీ కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు అలసత్వం వహించారంటూ ఇద్దరు సిబ్బందిపై ఈసీ చర్యలు తీసుకుంది. స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుళ్లు.. స్వామి నాయక్, నాగరాజుని వీఆర్ కి పంపించారు. ఈ ఘటన జరిగి రెండు వారాలవుతుండగా.. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుళ్లపై వేటు పడటం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక ఇదే సంఘటనపై ఎస్పీ రఘువీర్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాజారెడ్డిలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు కూడా జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ భారీగా జన సమీకరణ జరగడంపై ఈసీ సీరియస్ అయింది.

పైస్థాయి అధికారులపై చర్యలు లేకుండా కింది స్థాయి సిబ్బందిపై వేటు వేయడంపై జిల్లాలో ఒక‌టే ముచ్చ‌టించుకుంటున్నారు. అయితే 60 రోజుల్లో శాఖ పరమైన విచారణకూడా చేయాలని సూచించినట్లు సమాచారం. ఇక బ‌న్నీ న‌టిస్తున్న పుష్ప‌2 విష‌యానికి వ‌స్తే సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు ప్రేక్షకులకన్నా బాలీవుడ్ ప్రేక్షకులే ఈ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న మూవీ విడుదల కాబోతోంది. పుష్ప మొదటి భాగంలో ఐటం సాంగ్ దేశాన్ని ఎంతలా ఊపేసిందో అందరూ చూశారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది