Allu Arjun : ఈ సారి మ‌ల‌యాళ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : ఈ సారి మ‌ల‌యాళ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్

 Authored By ramu | The Telugu News | Updated on :14 June 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Allu Arjun : ఈ సారి మ‌ల‌యాళ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్

Allu Arjun : పుష్ప 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఏ విధంగా ఉందో మ‌నం చూస్తూనే ఉన్నాం. నిజానికి షెడ్యూల్ ప్రకారం అయితే ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ భారీ పాన్ ఇండియా మూవీని చేయాల్సింది అల్లు అర్జున్… అయితే లైన్ మార్చి, అట్లీతో ప్రాజెక్ట్‌ని లైన్‌లో పెట్టాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టే.

Allu Arjun ఈ సారి మ‌ల‌యాళ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్

Allu Arjun : ఈ సారి మ‌ల‌యాళ డైరెక్ట‌ర్‌తో అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్

Allu Arjun : క్రేజీ ప్రాజెక్ట్

అట్లీతో #AA22xA6 మూవీని ఇప్పటికే సెట్స్ మీదకి తీసుకెళ్లాడు అల్లు అర్జున్. ఈ భారీ బడ్జెట్ మూవీ 2027లో రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే బన్నీతో చేయాల్సిన మూవీని, సందీప్ రెడ్డి – రామ్ చరణ్‌తో చేయబోతున్నాడని టాక్.. కెరీర్ పీక్‌లో ఉండ‌గా, ఇలా రెండు ప్రాజెక్ట్‌లు, బన్నీ నుంచి సైడ్ కావడం చాలా పెద్ద షాకే…

అయితే అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్‌తో ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. ఈ గ్యాప్‌లో అల్లు అర్జున్, మలయాళ దర్శకుడు, నటుడు బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడట. అల్లు అర్జున్‌కి మలయాళంలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ఫ్లాప్ అయిన ‘వరుడు’ వంటి సినిమాలు కూడా కేరళలో సూపర్ హిట్‌గా నిలిచాయి. అందుకే అల్లు అర్జున్‌ని అక్కడివాళ్లు ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. టోవినో థామస్ హీరోగా ‘మిన్నల్ మురళి’ అనే సూపర్ హీరో సినిమా తెరకెక్కిన బాసిల్ జోసెఫ్, నటుడిగా, హీరోగా కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు..

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది