Categories: EntertainmentNews

Allu Arjun : నేను చ‌ట్టాన్ని గౌర‌విస్తాను.. జైలు నుండి విడుద‌లైన అల్లు అర్జున్..!

Advertisement
Advertisement

Allu Arjun : పుష్ప‌2తో మంచి విజ‌యాన్ని అందుకున్న అల్లు అర్జున్ లేనిపోని చిక్కులు తెచ్చుకున్నాడు. సంథ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది, ఆమె కొడుకు ఆస్పత్రి పాలయ్యాడు. ఐతే.. ఇందులో అల్లు అర్జున్‌కి సంబంధం ఉందా అనేది తెలియ‌క‌పోయిన ఆయ‌న‌ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది పరిశీలిస్తే.. BNSలోని రెండు సెక్షన్లు 105, 118 కింద ఈ కేసు నమోదైంది. ఇవి నిర్లక్ష్యం, ప్రజా రక్షణ అంశాలకు సంబంధించినవి. కాబట్టి.. ఈ కేసులో అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రేవతి అనే మహిళ చనిపోయింది అని కోర్టు భావించిన‌ట్టు తెలుస్తుంది. నిన్న అరెస్ట్ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు జైలు వద్దకు చేరుకున్నారు అభిమానులు. ప్రొసీజర్ ఆలస్యం కావడంతో రాత్రంతా జైలులోనే ఉన్నారు అల్లు అర్జున్.

Advertisement

Allu Arjun : నేను చ‌ట్టాన్ని గౌర‌విస్తాను.. జైలు నుండి విడుద‌లైన అల్లు అర్జున్..!

Allu Arjun పుష్ప విడుద‌ల‌…

జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్…నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు చేరుకున్నారు. అక్కడినుంచి ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన కుమారుడు అల్లు అయాన్‌ను హత్తుకున్నారు. కొడుకును కౌగిలించుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూతురు అర్హతో పాటు భార్య స్నేహారెడ్డి, కుటుంబ సభ్యులను కలసి ఎమోషనల్ అయ్యారు. అనంతరం ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చట్టాలను గౌరవిస్తానని అన్నారు. తాను బాగానే ఉన్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.

Advertisement

తాను చట్టాన్ని గౌరవిస్తానని వెల్లడించారు. తనకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపి న అల్లు అర్జున్.. రేవతి గారి కుటుంబానికి తన సానుభూతి వ్యక్తం చేసారు. జరిగిన ఘటన దురదృ ష్టకరంగా పేర్కొన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా అల్లు అర్జున్‌ వివరించారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేనని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ఎక్కడా ఎవరినీ తప్పు బడుతూ అల్లు అర్జున్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూస్తున్నా. ఆ రోజు ఘటన అనుకోకుండా జరిగింది. నేను చట్టాలను గౌరవిస్తా. లీగల్ అంశాలపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేను’ అని అల్లు అర్జున్ చెప్ప‌డం కొస‌మెరుపు.

Advertisement

Recent Posts

Allu Arjun : అల్లు అర్జున్ కష్టాలు.. జైల్లో ఆ రాత్రి ఏం చేశాడు.. ఏం తిన్నాడంటే..?

Allu Arjun : తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం ఉదయం హైదరాబాద్…

1 min ago

Allu Arjun : అల్లు అర్జున్ కి ఊహించని సపోర్ట్.. జరిగింది ఏదైనా అంతా మంచికే..!

పుష్ప 2 తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ ని 12 గంటల పాటు అరెస్ట్…

51 mins ago

Tirupati Laddu : లడ్డూ వివాదం : తిరుపతి బాలాజీ ఆలయానికి చేరుకున్న సిట్ బృందం

Tirupati Laddu : లడ్డూ వివాదం నేప‌థ్యంలో ఆలయ వంటశాలను పరిశీలించేందుకు ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)…

3 hours ago

House : ఎక్కువ ఖ‌ర్చు లేకుండా మీ క‌ల‌ల ఇంటిని సాకారం చేసుకోండిలా

House  : జీవన ప్రపంచం వేగంగా మారుతోంది. ఎక్కువ ఖర్చు లేకుండా మీ కలల ఇంటిని నిర్మించడం గురించి ఆలోచిస్తున్నారా?…

4 hours ago

Allu Arjun Lawyer : అల్లు అర్జున్‌కి బెయిల్ ఇప్పించిన లాయ‌ర్ ఎవ‌రు.. ఆయ‌న గంట‌కు ఎంత తీసుకున్నారంటే….!

Allu Arjun Lawyer : డిసెంబర్ 4 న పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌లో జరిగిన…

5 hours ago

Winter Eyes : చ‌లికాలంలో కండ్ల సంర‌క్ష‌ణ‌పై ఆందోళ‌న‌గా ఉన్నారా? అయితే ఈ ఈజీ టిప్స్ మీకోస‌మే

Winter Eyes : చ‌లికాలంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో మీకు సహాయపడే ప్రతిదాన్ని మీరు చేస్తారు.…

6 hours ago

Post Office Schemes : పోస్టాఫీసు ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. ధనవంతులు అవ్వండి

Post Office Schemes : నిరుద్యోగం మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరికీ పెద్ద సవాలు.…

7 hours ago

Good News : పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు శుభవార్త..!

Good News : దేశ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు శుభవార్త. పెట్రోలు, డీజిల్‌లను వస్తు సేవల పన్ను…

8 hours ago

This website uses cookies.