Allu Arjun : నేను చ‌ట్టాన్ని గౌర‌విస్తాను.. జైలు నుండి విడుద‌లైన అల్లు అర్జున్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : నేను చ‌ట్టాన్ని గౌర‌విస్తాను.. జైలు నుండి విడుద‌లైన అల్లు అర్జున్..!

 Authored By ramu | The Telugu News | Updated on :14 December 2024,9:53 am

ప్రధానాంశాలు:

  •  Allu Arjun : నేను చ‌ట్టాన్ని గౌర‌విస్తాను.. జైలు నుండి విడుద‌లైన అల్లు అర్జున్..!

Allu Arjun : పుష్ప‌2తో మంచి విజ‌యాన్ని అందుకున్న అల్లు అర్జున్ లేనిపోని చిక్కులు తెచ్చుకున్నాడు. సంథ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది, ఆమె కొడుకు ఆస్పత్రి పాలయ్యాడు. ఐతే.. ఇందులో అల్లు అర్జున్‌కి సంబంధం ఉందా అనేది తెలియ‌క‌పోయిన ఆయ‌న‌ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది పరిశీలిస్తే.. BNSలోని రెండు సెక్షన్లు 105, 118 కింద ఈ కేసు నమోదైంది. ఇవి నిర్లక్ష్యం, ప్రజా రక్షణ అంశాలకు సంబంధించినవి. కాబట్టి.. ఈ కేసులో అల్లు అర్జున్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రేవతి అనే మహిళ చనిపోయింది అని కోర్టు భావించిన‌ట్టు తెలుస్తుంది. నిన్న అరెస్ట్ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో భారీ సంఖ్యలో అభిమానులు జైలు వద్దకు చేరుకున్నారు అభిమానులు. ప్రొసీజర్ ఆలస్యం కావడంతో రాత్రంతా జైలులోనే ఉన్నారు అల్లు అర్జున్.

Allu Arjun నేను చ‌ట్టాన్ని గౌర‌విస్తాను జైలు నుండి విడుద‌లైన అల్లు అర్జున్

Allu Arjun : నేను చ‌ట్టాన్ని గౌర‌విస్తాను.. జైలు నుండి విడుద‌లైన అల్లు అర్జున్..!

Allu Arjun పుష్ప విడుద‌ల‌…

జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్…నేరుగా జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు చేరుకున్నారు. అక్కడినుంచి ఇంటికి వెళ్లారు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే తన కుమారుడు అల్లు అయాన్‌ను హత్తుకున్నారు. కొడుకును కౌగిలించుకొని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూతురు అర్హతో పాటు భార్య స్నేహారెడ్డి, కుటుంబ సభ్యులను కలసి ఎమోషనల్ అయ్యారు. అనంతరం ప్రెస్ మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చట్టాలను గౌరవిస్తానని అన్నారు. తాను బాగానే ఉన్నానని అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు.

తాను చట్టాన్ని గౌరవిస్తానని వెల్లడించారు. తనకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు తెలిపి న అల్లు అర్జున్.. రేవతి గారి కుటుంబానికి తన సానుభూతి వ్యక్తం చేసారు. జరిగిన ఘటన దురదృ ష్టకరంగా పేర్కొన్నారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటనగా అల్లు అర్జున్‌ వివరించారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేనని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ఎక్కడా ఎవరినీ తప్పు బడుతూ అల్లు అర్జున్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమాలు చూస్తున్నా. ఆ రోజు ఘటన అనుకోకుండా జరిగింది. నేను చట్టాలను గౌరవిస్తా. లీగల్ అంశాలపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేను’ అని అల్లు అర్జున్ చెప్ప‌డం కొస‌మెరుపు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది