Allu Arjun : బ్యాడ్ టైం అంటే ఇదేనేమో.. అస‌లు బన్నీ చుట్టూ ఏం జరుగుతుంది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu Arjun : బ్యాడ్ టైం అంటే ఇదేనేమో.. అస‌లు బన్నీ చుట్టూ ఏం జరుగుతుంది..?

 Authored By ramu | The Telugu News | Updated on :13 December 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Allu Arjun : బ్యాడ్ టైం అంటే ఇదేనేమో.. అస‌లు బన్నీ చుట్టూ ఏం జరుగుతుంది..?

Allu Arjun : పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప రాజ్ మేనియా ఒక సెన్సేషన్ గా ఉంటే.. ఇక్కడ మాత్రం అతని నివాసంలో మాత్రం పోలీసుల హంగామా ఎక్కువైంది. పుష్ప 2 ప్రీమియర్స్ టైం లో రేవతి అనే మహిళ మృతికి అల్లు అర్జున్ కారణమని పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రేవతి హస్బండ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు పోలీసులు విచారణకు దిగారు. ఐతే మహిళ మరణించిందని తెలియగానే అల్లు అర్జున్ ఇంకా చిత్ర యూనిట్ పాతిక లక్షలు ఆ ఫ్యామిలీకి ఇచ్చారు. ఐతే ఎలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ థియేటర్ కి రావడం తో ఈ తొక్కిసలాట జరిగింది. అందుకే మహిళ మృతిచెందిన కేసులో సెక్షన్ 115, 108(1), రెడ్ విత్ 3/5 బి.ఎన్.ఎస్ కింద కేసు ఫైల్ అయ్యింది. ఐతే అల్లు అర్జున్ అరెస్ట్ కి అతను పర్మిషన్ లేకుండా థియేటర్ కి రావడమే కాగా ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమా వాళ్లను చేస్తున్న సాఫ్ట్ టార్గెట్ అన్నట్టుగా కొందరు చెబుతున్నారు.

Allu Arjun బ్యాడ్ టైం అంటే ఇదేనేమో అస‌లు బన్నీ చుట్టూ ఏం జరుగుతుంది

Allu Arjun : బ్యాడ్ టైం అంటే ఇదేనేమో.. అస‌లు బన్నీ చుట్టూ ఏం జరుగుతుంది..?

Allu Arjun నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చేయడంతో..

అలా ఎందుకు అంటే హైడ్రా అంటూ ఆమధ్య చెరువుల బఫర్ జోన్ లో ఉన్న బిల్డింగ్స్ కూలగొట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్ కన్వెన్షన్ ని కూల్చేసింది. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చేయడంతో దాని గురించి అందరికీ తెలిసింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప ప్రీమియర్స్ టైం లో మహిళ మృతి చెందగా మొదట సంధ్య థియేటర్ ఓనర్, సెక్యురిటీ ఇంచార్జ్ ని అరెస్ట్ చేయగా ఇప్పుడు అల్లు అర్జున్ ని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసుల ముందు ఎవరైనా ఒకరే అని చెప్పేలా రేవంత్ సర్కార్ చేస్తుందని అంటున్నారు. ఐతే పుష్ప 2 సక్సెస్ మీట్ లో తెలంగాణా సీఎం పేరు గుర్తు రాక కాస్త ఇబ్బంది పడ్డాడు అల్లు అర్జున్.

దాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ కేసులో అతన్ని అరెస్ట్ చేశారని అంటున్నారు. ఏది ఏమైనా సినిమా సక్సెస్ అయిన దాని కన్నా అల్లు అర్జున్ కి ఈ కేసులు గొడవలు తలనొప్పిగా మారాయని చెప్పొచ్చు. ఓ పక్క అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. Allu Arjun Bad Luck , Allu Arjun, Nagrjuna, Revanth Reddy, Pushpa 2

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది