Allu Arvind : రాంగోపాల్ వర్మపై అల్లు అరవింద్ సీరియస్ వ్యాఖ్యలు వీడియో..!!

Authored By Breaking News | The Telugu News | Published on: August 17, 2023, 9:00 pm

Allu Arvind : గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పై మెగా ఫ్యామిలీ పై శ్రీ రెడ్డి దేవరస్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులను ఉద్దేశించి బూతు పదం వాడే విధంగా ప్రముఖ మీడియా ఛానల్స్ ముందు నటి శ్రీరెడ్డి రెచ్చిపోయింది.

దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల సమయంలో నటి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా వరకు రాజకీయంగా పెను దుమారాన్ని రేపాయి. అయితే శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీ పై చేసిన వ్యాఖ్యల వెనకాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు అప్పట్లో అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పై కావాలని ఆర్జీవి ఉసిగొలిపినట్లు చెప్పుకొచ్చారు. కావాలని కక్షపూరితంగా వ్యవహరించినట్లు మండిపడటం జరిగింది.

allu arvind comments on ramgopal varma

allu arvind comments on ramgopal varma

పవన్ కళ్యాణ్ స్థాయి తగ్గించడానికి ఆర్జీవి వెనకాల కొంతమంది కుట్ర దారులు కూడా ఉన్నారని అప్పట్లో అల్లు అరవింద్ మండిపడ్డారు. ఆర్జీవి తక్కువ రకం మనిషి అని కూడా అన్నారు అప్పట్లో. నీ తల్లినో… కూతురినో.. అక్కనో.. అదే నాలుగు అక్షరాల ఇంగ్లీష్ మాటను మాట్లాడిస్తే.. ఆ బాధ నీకు ఎలా ఉంటుందో తెలుసా.. అనీ ప్రశ్నించారు. రాంగోపాల్ వర్మ నీకున్న నీచత్వం మాకు లేదని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp