Amala Paul : నూతన వసంతంలోకి అమలా పాల్.. స్టన్నింగ్ బ్యూటీ స్పెషల్ పోస్ట్..
Amala Paul : బ్యూటిఫుల్ హీరోయిన్ అమలా పాల్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకుంది. తమిళ్, మలయాళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన అమలా పాల్.. బోల్డ్ రోల్స్ ప్లే చేసి మిగతా హీరోయిన్స్ కంటే తాను కొంచెం డిఫరెంట్ అని అనిపించుకుంది. ఇకపోతే ‘తలైవి’ ఫేమ్ డైరెక్టర్ ఏ.ఎల్.విజయ్‌ను మ్యారేజ్ చేసుకున్న ఈ భామ 2017లో ఆయనకు డైవోర్స్ ఇచ్చింది. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది ఈ సుందరి. ఈ సంగతులు అలా ఉంచితే..తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా అమలా పాల్ స్పెషల్ పోస్టు పెట్టింది.
సదరు పోస్టు చాలా ఆసక్తికరంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.అమలా పాల్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన పోస్టులో తన ఫొటోను కూడా పంచుకుంది. వైట్ కలర్ టాప్‌లో హాఫ్ ఫొటోలో అమలా పాల్ ముక్కుకు ముక్కెర ధరించి అలా కోర చూపుతో ఆకట్టుకుంటోంది. ఇక పోస్టు విషయానికొస్తే.. 2021 వ సంవత్సరం ఇంకో పది రోజుల్లో ముగియబోతున్నది. ఈ క్రమంలోనే నూతన వసంతం అనగా 2022 వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే సమయంలో తన జీవితానికి సంబంధించిన గతేడాది జరిగిన విషయాలను గురించి ప్రస్తావించింది.

amala paul shared interesting post in instagram
Amala Paul : సెన్సిబుల్ పోస్టుతో నెటిజన్లు హృదయాలు దోచుకున్న అమలా పాల్..
తన జీవితంలో మూడు విషయాలు 2021 వ సంవత్సరంలో గైడ్ చేశాయని పేర్కొన్న అమలా పాల్.. వాటిని గురించి పంచుకుంది. సంపూర్ణ వసంతం గురించి, తన ఆత్మ గురించి, తనను ఇంత కాలం సపోర్ట్ చేసిన ఇన్ స్టిట్యూషన్స్ గురించి తెలిపింది. వారందరికీ థాంక్స్ చెప్పింది అమలా పాల్. అమలా పాల్ పెట్టి న పోస్టు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత సెన్సిటివ్ అయిపోయిందేంటి అమలా అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అమలకు థాంక్స్ చెప్తున్నారు.లవ్ సింబల్స్ పోస్టు చేస్తున్నారు. లవ్లీ పోస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు.