Bigg Boss Telugu 7 : శివాజీ పవరాస్త్ర దొంగలించిన అమర్‌దీప్.. తొక్క తీస్తా బిడ్డా.. శివాజీ మాస్ వార్నింగ్ అదుర్స్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: September 20, 2023, 1:00 pm

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ హౌస్ లో రోజురోజుకూ ఏమేమో జరుగుతోంది. కంటెస్టెంట్ల మధ్య మరింత గొడవ పెట్టడానికి బిగ్ బాస్ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మామూలుగా కాదు.. బిగ్ బాస్ హౌస్ అంటేనే అది ప్రశాంతంగా ఉండకూడదు. ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండాలి. అప్పుడే కదా ప్రేక్షకులకు మజా వచ్చేది. ఇంట్లో అందరూ బాగా ఉంటే మజా ఎక్కడ వస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండాలి. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో అదే జరుగుతోంది. మిగితా సీజన్లతో పోల్చితే ఈ సీజన్ మాత్రం అదిరిపోయింది అనే చెప్పుకోవాలి.

amardeep theft shivaji powerasthra in bigg boss telugu 7

#image_title

ఇక.. బిగ్ బాస్ హౌస్ లో రెండో ఇంటి సభ్యుడిగా శివాజీ కన్ఫమ్ అయిన విషయం తెలిసిందే. అందుకే శివాజీకి పవరాస్త్రను ఇస్తాడు బిగ్ బాస్. ఆ పవరాస్త్రను ఎవరు దొంగలించినా కూడా దానికి అంతగా పవర్స్ లేవని.. అంటాడు బిగ్ బాస్. హోస్ట్ నాగార్జున కూడా అదే చెబుతాడు. సందీప్ పవరాస్త్రకు మాత్రమే ఆ పవర్ ఉందని.. కానీ.. శుభశ్రీ చాలాసేపు ఆ పవరాస్త్రను దాయలేకపోతుంది. కానీ.. శివాజీ పవరాస్త్రను దొంగలించి తీసుకెళ్లి బాత్ రూమ్ లో దాస్తాడు అమర్ దీప్.

Bigg Boss Telugu 7 : దొంగనా కొడుకులు ఉన్నారు ఈ హౌస్ లో అంటూ శివాజీ ఫైర్

ఇక్కడ ఏం గెలిచినా కూడా ఉపయోగం లేదు. ఇక్కడ అందరూ దొంగనా కొడుకులు ఉన్నారు. వాళ్ల అమ్మానాన్నలు ఇవే నేర్పించారా వాళ్లకు… అంటూ శివాజీ ఫైర్ అవుతాడు. అసలు ఆ పవరాస్త్రను దొంగలించింది అమర్ దీప్ అని శివాజీకి తెలియదు. టాస్క్ ఇస్తే ఓకే కానీ.. టాస్క్ ఇవ్వకున్నా కూడా ఇలా ఒకడి వస్తువును దొంగతనం చేయడం ఏంటి? అమ్మానాన్నలు దొంగతనం చేయమని పంపించారా ఇక్కడికి అంటూ శివాజీ ఫైర్ అవుతాడు. ఏం మనుషులురా.. పవరాస్త్రలు తీసుకోవడం ఏంటి.. చిల్లర వ్యవహారం.. తొక్క తీస్తా ఎవరో తెలిస్తే. బ్లడ్ వస్తుంది చెవుల్లో నుంచి. నేను ఎవరిదైనా తీసుకున్నానా? మీకు టాస్క్ ఇస్తే ఓకే.. కానీ.. టాస్క్ ఇవ్వకున్నా ఏంటి ఈ చిల్లర గేమ్స్. ఆరోజు ఆయన చెప్పాడు. ఫస్ట్ దానికి ఇలా ఉంది అని రెండోసారి క్లియర్ గా చెప్పాడు. లేదు.. ఎవడైనా పిచ్చోడు పెట్టుకుంటాడా? అంటూ అమర్ దీప్ ముందే శివాజీ ఫైర్ అవుతాడు.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp