Amitaab bacchan : ప్రపంచ సినీ వారసత్వాన్ని కాపాడుతున్న బాలీవుడ్ అమితాబ్ బచ్చన్….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Amitaab bacchan : ప్రపంచ సినీ వారసత్వాన్ని కాపాడుతున్న బాలీవుడ్ అమితాబ్ బచ్చన్….!

Amitaab bacchan : ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డ్ వేడుకల్లో ఎన్నో అవార్డులను.. అలాగే 15 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు అమితాబ్. ఉత్తమ నటుడుగా 40సార్లు నామినేటవడం ఎంతో గొప్ప విషయం. బాలీవుడ్ లెజెండరీ నటుడు, యాంగ్రీ యంగ్ మాన్ , బాలీవుడ్ షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనగానే గుర్తొచ్చె పేరు అమితాబ్ హరివంశ్ బచ్చన్. మానవత్వానికి, సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. […]

 Authored By govind | The Telugu News | Updated on :23 March 2021,9:54 am

Amitaab bacchan : ఉత్తమ నటునిగా నాలుగు జాతీయ అవార్డులు, అంతర్జాతీయ స్థాయి సినిమా ఫెస్టివల్స్, అవార్డ్ వేడుకల్లో ఎన్నో అవార్డులను.. అలాగే 15 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకున్నారు అమితాబ్. ఉత్తమ నటుడుగా 40సార్లు నామినేటవడం ఎంతో గొప్ప విషయం. బాలీవుడ్ లెజెండరీ నటుడు, యాంగ్రీ యంగ్ మాన్ , బాలీవుడ్ షెహెన్ షా, స్టార్ ఆఫ్ ది మిలీనియం, బిగ్ బి అనగానే గుర్తొచ్చె పేరు అమితాబ్ హరివంశ్ బచ్చన్. మానవత్వానికి, సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. ఈయన దాదాపు 180 పైగా సినిమాలు చేశారు. భారతీయ సినిమాలో అమితాబ్ అత్యంత ప్రభావవంతమైన నటుడని ఎన్నో సందర్భాలలో ప్రముఖులందరు బహిరంగంగా చెప్పిన సందర్భాలున్నాయి. భారతదేశం లోనే కాక పలు దేశాలలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అప్పట్లో ఫ్రెంచి దర్శకుడు అమితాబ్ ని ‘ఒన్ మాన్ ఇండస్ట్రీ’ గా వర్ణించారు.

amitaab bacchan like famous actor never before ever after

amitaab-bacchan-like-famous-actor-never-before-ever-after

ఒక్క బాలీవుడ్ లోనే కాక టాలీవుడ్, హలీవుడ్ లో కూడా పేరు ప్రఖ్యాతలని సాధించారు. ఫ్రెంచి డాక్యుమెంటరీ మార్చి ఆఫ్ ది పెంగ్విన్స్ కు తన గాత్రం అందించారు అమితాబ్. భారత ప్రభుత్వం అమితాబ్ ను పద్మశ్రీతోనూ, పద్మ భూషణ్ తోనూ, పద్మవిభూషణ్ తోనూ గౌరవించింది. ఫ్రెంచి ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన “లెగియన్ ఆఫ్ హానర్”తో గౌరవించారు. అమితాబ్ రాజకీయాలలో కూడా తమ ప్రతిభను చాటారు. అమితాబ్ నటునిగానే కాక, నేపధ్య గాయకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ యాంకర్ గానూ వ్యవహరించారు. అందులో చెప్పుకోదగ్గవి కౌన్ బనేగా కరోడ్ పతి, రియాలిటీ షో బిగ్ బాస్, సోని టివిలో యుధ్ ధారావాహికలో టైటిల్ పాత్రలో నటించారు. హాలీవుడ్ లో మొదటిసారి “ది గ్రేట్ గేట్స్బే” అనే సినిమాతో అడుగుపెట్టారు. గాంభీర్యమైన గాత్రం వల్ల సత్యజిత్ రే , షత్రంజ్ కే ఖిలారీ,లగాన్ అనే సినిమాలకుగాను వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Amitaab bacchan : నోలాన్.. మార్టిన్ స్కోర్సెస్ స్వయంగా మెగాస్టార్ ని  ఎఫ్ఐఎఎఫ్ అవార్డును అందించారు.

ప్రముఖ హాలీవుడ్ దర్శకనిర్మాతలు, ఆస్కార్ గ్రహీతలు అయిన క్రిస్టోఫర్ నోలాన్.. మార్టిన్ స్కోర్సెస్ స్వయంగా మెగాస్టార్ ని సత్కరించారు. ఈ అవార్డ్ భారతదేశ సినీ వారసత్వాన్ని కాపాడుతున్నందుకు చేసిన కృషికి గానూ ఈ అరుదైన గౌరవాన్ని అందించారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్ఐఎఎఫ్) అవార్డును మార్టిన్.. నోలన్ వర్చువల్ వేడుక ద్వారా ప్రపంచ సినీ వారసత్వాన్ని కాపాడుతున్నందుకు గాను అమితాబ్ బచ్చన్ కు అందజేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ చీఫ్ శివేంద్ర సింగ్ దుంగార్పూర్ కలిసే
భాగ్యం తనకు దొరికినందుకు ఆనందాన్ని వ్యక్తం చేసారు. అలాగే హాలీవుడ్ దిగ్గజాలు మార్టిన్.. నోలన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. స్వతహాగ మార్టిన్ సోర్సరర్, నోలాన్ డజన్ల కొద్దీ ఆస్కార్ లు అందుకున్న ప్రముఖుల చేత ఇలాంటి అరుదైన గౌరవం దక్కినందుకుగాను ఇండస్ట్రీ వర్గాలు అమితాబ్ పై ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు. అంతేకాదు అసలు అమితాబ్ బచ్చన్ లాంటి నటుడు మళ్ళీ పుట్టగలడా..! అంటూ మాట్లాడుకోవడం గొప్ప విషయం.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది