How To Get Lakshmi Kataksham
Lakshmi Kataksham శ్రీలక్ష్మీదేవి.. సకల సంపదలకు అమ్మ అధిదేవత. ఆమె అనుగ్రహం లేనిది ఎటువంటి ధనం అయినా మనకు లభించదు. లక్ష్మీ అంటే కేవలం ధనమే కాదు.. ఆరోగ్యం, సంతానం, ధాన్యం, ఇలా అనేక రకాలుగా అమ్మ రూపాలుగా మనకు గోచరం అవుతుంటుంది. అయితే అమ్మ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండదో అనే విషయాన్ని తెలుసుకుందాం.. పూర్వం ఒకప్పుడు నారదముని లక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని శ్రీ మహావిష్ణువుని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పారు. లక్ష్మీదేవి విశ్వం అంతా వ్యాపించిన విష్ణువునైనా నాతోపాటు అంతటా ఉంటుంది. లక్ష్మి మొదట ఎవరివద్ద వుండదో శ్రీమహావిష్ణువు వివరించాడు.
దీపారాధన చేయని గృహంలో, శుభ్రం లేని ఇండ్లలలో, శంఖద్వని వినిపించని చోటా, తులసిని పూజించని చోట. శంఖరుని అర్చించని చోట, ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట. విష్ణు అర్చన చేయని చోట, పండితులను, విద్యావేత్తలను, బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట. ధర్మం, శౌచం వీటిని పాటించని చోట కూడా శ్రీలక్ష్మి దేవి నివసించదు.
How To Get Lakshmi Kataksham
శుభ్రమైన ఇల్లు, భక్తులు నివసించే ఇల్లు, నిత్య దీపారాధన, దైవ ఆరాధన ఉండే చోట ఉంటుంది. విష్ణువును ఆరాధించే చోట, శివాభిషేకం లేదా శివార్చన జరిగే చోట అమ్మవారు ఉంటుంది. శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మి విరాజిల్లుతుంది.
నిత్యం పచ్చని తోరణం, పసుపు గడుపలు, తులసి కోట ఉన్న చోట అమ్మవారు నివసిస్తుంది. ముతైదువలను గౌరవించిన చోట, బాలికలను, మహిళలను అమ్మవారి స్వరూపంగా భావించి గౌరవించిన చోట అమ్మవారు నివసిస్తుంది. ఎల్లప్పుడు సుమంగళీ ద్రవ్యాలతో, అర్చనలతో, సంతోషంతో ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది.
శంకరుడు, విష్ణువులను ఆరాధించిన వారిపై అమ్మ అనుగ్రహం శ్రీఘ్రంగా పడుతుంది. అంతేకాదు నిత్యం వాదనలు, గొడవులు పడే వారి ఇంట్లో, అబద్దాలు ఆడే వారి దగ్గర అమ్మవారు నిలవదు. శుభ్రమైన దుస్తులు, పరిసరాలు, అలవాట్లు ఉన్నచోటే లక్ష్మీదేవి ఉంటుంది.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.