Anna Canteen : అన్న క్యాంటిన్‌లో అవినాష్‌తో కలిసి భోజనం చేసిన అమ్మ రాజశేఖర్.. ఆహా ఏమి రుచి అంటూ కామెంట్
ప్రధానాంశాలు:
Anna Canteen : అన్న క్యాంటిన్‌లో అవినాష్‌తో కలిసి భోజనం చేసిన అమ్మ రాజశేఖర్.. ఆహా ఏమి రుచి అంటూ కామెంట్
Anna Canteen : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఓ రేంజ్‌లో జరుగుతుంది. ఎంతో ఆర్భాటంగా ‘అన్నా క్యాంటీన్’లను తిరిగి ప్రారంభించింది. 2024 ఆగష్టు 15 నుంచి ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్‌లను ఏర్పాటు చేసి.. పేదల కడుపు నింపుతున్నారు. మొత్తం 17 జిల్లాలలో దాదాపు 99 అన్నా క్యాంటీన్‌లను ప్రారంభించారు. అయితే ఇప్పుడు అన్నా క్యాంటీన్‌కి కేవలం పేదలు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా వెళ్లి భోజనం చేస్తున్నారు.
Anna Canteen టేస్ట్ అదిరింది..
రీసెంట్‌గా సీనియర్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ అమ్మా రాజశేఖర్ ‘అన్నా క్యాంటీన్’లో భోజనం చేసి.. ఆహా ఏమిరుచి అంటూ తెగ పొగిడేస్తున్నారు. విశాఖపట్నంలోని అన్న క్యాంటీన్‌లో అమ్మా రాజశేఖర్ భోజనం చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘తల’ సినిమా రిలీజ్‌కి రెడీ కావడంతో ప్రమోషన్స్‌లో భాగంగా వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నారు. ఈ సినిమాతో అమ్మా రాజశేఖర్ కొడుకు రాగిన్ రాజ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
ఈ సినిమాలో ముక్కు అవినాష్.. కీలక పాత్రలో నటించారు. అమ్మా రాజశేఖర్, ముక్కు అవినాష్‌లు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కావడంతో.. తాను చేయబోయే సినిమాలో అవినాష్‌కి ఛాన్స్ ఇస్తానని అప్పట్లోనే చెప్పారు అమ్మా రాజశేఖర్. ఇచ్చిన మాట ప్రకారం అవినాష్‌కి తన దర్శకత్వంలోని ‘తల’ సినిమాలో అవకాశం ఇచ్చారు అమ్మా రాజశేఖర్.
‘అన్న క్యాంటీన్’లో అమ్మ రాజశేఖర్ భోజనం
విశాఖ నగరంలోని అన్న క్యాంటీన్‌లో డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్, నటుడు ముక్కు అవినాష్, ‘తల’ చిత్రంతో హీరోగా పరిచయం కానున్న రాగిణి రాజ్, చిత్రబృందం. అన్న క్యాంటీన్‌లో భోజనం చేశారు. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. విశాఖ… pic.twitter.com/PCtRb8k22p
— ChotaNews App (@ChotaNewsApp) February 6, 2025