Ananya Nagalla : పులితో పరాచకాలా.. అనన్య నాగళ్ల ఎంత పని చేసింది?
Ananya Nagalla : తెలుగమ్మాయి అనన్య నాగళ్ల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే తెలుగమ్మాయి అనన్య నాగళ్ల నటనలో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు ‘షాదీ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని రీతిలో స్పందన దక్కింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ కూడా అందుకుని యమ పాపులర్ అయిపోయింది. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు అద్భుతమైన హవాభావాలు, నటనతో అలరిస్తోన్న అనన్యకు ఈ మధ్య కాలంలో వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి.
ఇందులో భాగంగానే ‘మల్లేశం’ అనే సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’లో ఈ అమ్మాయి అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రను చేసింది. ఇందులో కూడా మంచి నటనతో మంచి మార్కులు కొట్టేసి మరింత క్రేజ్ అందుకుంది. హీరోయిన్‌గా ఇప్పటికే పలు విజయాలను అందుకున్న అనన్య నాగళ్ల.. గత ఏడాది ‘ప్లేబ్యాక్’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ‘మాస్ట్రో’లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి.

ananya nagalla fun with tiger
Ananya Nagalla : ఫుల్ ఖుష్..
ఇక, ఇప్పుడు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ రియాన్ నటిస్తోన్న ‘బూట్‌కట్ బాలరాజు’ సహా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. అనన్యా నాగళ్ల ప్రస్తుతం వెకేషన్ నిమిత్తం థాయ్‌లాండ్ వెళ్లింది. అక్కడి జూలో ఓ పెద్ద పులితో సరదాగా కాసేపు గడిపింది. మొదట్లో కాస్త భయపడింది. అక్కడి ట్రైనర్ సహాయంతో పులిని చేతితో తాకుతూ పక్కనే కూర్చొని ఫోటోలు దిగితూ.. తెగ ఎంజాయ్ చేసింది అనన్యా నాగళ్ల. పులిని తాకుతూ ఆ ఎగ్టైట్‌మెంట్‌ని అనన్యా నాగళ్ల ఫీలవుతోంది. అనన్యా నాగళ్ల ప్రస్తుతం ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. సమంత లీడ్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమాలో అనన్య ఓ కీలక పాత్రలో నటిస్తోంది.
View this post on Instagram