Anasuya : ఎక్స్పోజింగ్ చేయడంపై ఓ నెటిజన్ కి దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిన అనసూయ…! | The Telugu News

Anasuya : ఎక్స్పోజింగ్ చేయడంపై ఓ నెటిజన్ కి దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిన అనసూయ…!

Anasuya : బుల్లితెర బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలుసు. నిత్యం పలు రకాల ఫోటోలతో, పోస్టులతో జనాలను ఆకట్టుకుంటూ ఉంటారు. యాంకర్ గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో వెండితెరపై కూడా అదే క్రేజ్ తో దూసుకెళుతున్నారు. పూర్తిగా బుల్లితెరకి బై బై చెప్పేసి ప్రస్తుతం వెండితెరపై బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా సినిమాలలో నటించి ఆకట్టుకున్న అనసూయ ఇటీవల ప్రేమవిమానం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. […]

 Authored By aruna | The Telugu News | Updated on :30 October 2023,9:18 pm

ప్రధానాంశాలు:

  •  క్స్పోజింగ్ చేయడంపై ఓ నెటిజన్ కి దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిన అనసూయ

  •  ఎక్స్పోజింగ్ చేయాలంటే మానసికంగా, శారీరకంగా చాలా ప్రిపేర్ అవ్వాలి అనసూయ

Anasuya : బుల్లితెర బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలుసు. నిత్యం పలు రకాల ఫోటోలతో, పోస్టులతో జనాలను ఆకట్టుకుంటూ ఉంటారు. యాంకర్ గా ఎంత గుర్తింపు తెచ్చుకున్నారో వెండితెరపై కూడా అదే క్రేజ్ తో దూసుకెళుతున్నారు. పూర్తిగా బుల్లితెరకి బై బై చెప్పేసి ప్రస్తుతం వెండితెరపై బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా సినిమాలలో నటించి ఆకట్టుకున్న అనసూయ ఇటీవల ప్రేమవిమానం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్ ఇంట తెగ వైరల్ గా మారాయి.

పాత హీరోయిన్స్ మాదిరిగా ముస్తాబయి దిగిన ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్ చేశారు. ఒక నెటిజన్ చాలా అందంగా ఉన్నారు. సావిత్రి మాదిరి లాగానే ఉన్నారు అంటూ కామెంట్ చేశారు. ఇక మరొక నెటిజన్ ఎక్స్పోజింగ్ చేసిన అంత ఈజీ కాదు సావిత్రి గారిలా నటించడం అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ పై అనసూయ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అనసూయ స్పందిస్తూ చాలా కరెక్ట్ గా చెప్పారండి. సావిత్రి గారిలా నటించడం ఎవరి తరం కాదు. నేను ట్రిబ్యూట్ ఇచ్చాను అంతే. అలాగే ఎక్స్పోజింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు.

ఎక్స్పోజింగ్ చేయాలంటే మానసికంగా, శారీరకంగా చాలా ప్రిపేర్ అవ్వాలి. ఏ పని చేసినా, ఎటువంటి దుస్తులు ధరించి మన పనిని దృఢ సంకల్పంతో చేయాలి అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అనసూయ పెట్టే ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఆమె కూడా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండ్ అవుతూ ఉంటారు. ఇక సినిమాల పరంగా కూడా ఫుల్ బిజీగా ఉన్నారు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...