Anasuya And Sreemuhi : ఇద్దరూ కలిసి తాగారా ఏంటి?.. అనసూయ, శ్రీముఖిలపై ట్రోలింగ్.. వైరల్ వీడియో
Anasuya And Sreemuhi యాంకర్ అనసూయ మీద అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగని రోజంటూ ఉండదు. అనసూయ కూడా నెటిజన్ల మీద నోరు పారేసుకోని రోజంటూ ఉండదు. మొన్నే హైపర్ ఆది తన స్కిట్లో అనసూయ భాగోతాన్ని బయటపెట్టేశాడు. లైవ్‌లోకి వస్తే చాలు ఆమె ఎవరో ఒకరిని తిట్టకుండా వెళ్లదు అనేట్టుగా సెటైర్ వేశాడు ఆది. ఇప్పుడు లైవ్‌లోకి రాక చాలా కాలమైందని, ఎవ్వరినీ తిట్టలేదని అనసూయ వయ్యారాలు ఒలకబోసింది.

Anasuya And Sreemuhi Nail Design Goes Viral
Anasuya And Sreemuhi ఇద్దరూ కలిసి తాగారా ఏంటి ?.. అనసూయ, శ్రీముఖిలపై ట్రోలింగ్
అయితే తాజాగా శ్రీముఖి, అనసూయ కలిసి చేసిన పనికి నెటిజన్లు దారుణంగా ఏకిపారేస్తున్నారు. యారీ తేరీ దారు దేసి అంటూ బీరు ఎమోజీని శ్రీముఖి షేర్ చేసింది. ఇందులో ఈ ఇద్దరూ చిన్న పిల్లల్లా పిచ్చి చేష్టలు చేశారు. అయితే ఈ వీడియోలోఈ ఇద్దరూ తమ నెయిల్ పాలింష్, గోర్లకు వేసుకున్న డిజైన్‌ను చూపించారు. తామిద్దం ఒకేలా వేసుకున్నామని చెప్పేందుకు ఈ పాట్లు పడ్డారు.
అయితే వీటిపై నెటిజన్లు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఇందులో ఏముందని, గోర్ల పెయింట్ చూపించేందుకు కూడా ఇంత చేయాలా?మీ ఇద్దరూ కలిసి తాగారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటూ నెటిజన్లు వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి శ్రీముఖి, అనసూయ ఇలా మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నారు.
View this post on Instagram