Anasuya: క్ష‌మాప‌ణ‌లు కోరిన అనసూయ‌.. ఎందుకో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: July 20, 2022, 7:00 pm

Anasuya: న‌టిగా, యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. సోష‌ల్ మీడియా ద్వారా విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా సినిమాల‌తో బిజీగా ఉంది. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో మెప్పించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అన‌సూయ ఇటీవలే పాన్ ఇండియా చిత్రం పుష్పలోనూ దాక్షాయణి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దర్జా. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ మూవీలో సునీల్ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Anasuya: ఎందుకు చెప్పిందో తెలుసా?

ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను సోమవారం హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో అన‌సూయ మాట్లాడుతూ.. అల్లు అరవింద్‌గారు, వెంకటేష్‌గారు, సురేష్‌బాబుగారు, రాఘవేంద్రరావుగారు, నవీన్ ఎర్నేనిగారు, బుచ్చిమాయ్య.. వీరంతా ‘దర్జా’ టీమ్‌కు ఎంతో సపోర్ట్ అందించారు. ఈ సినిమాకు సంబంధించి.. ఇప్పటి వరకు జరిగిన ఏ ప్రొమోషనల్ ఈవెంట్‌లోనూ భాగం కాలేదు.

Anasuya Apologies to team Darja

Anasuya Apologies to team Darja

అందుకు టీమ్‌ని క్షమించమని అడుగుతున్నాను. అందుకు కారణం ఏమిటనేది యూనిట్‌కి చెప్పడం జరిగింది. ఈ సినిమాలో నేను పార్ట్ కావడానికి కారణం ఇద్దరు. ఒకరు ప్రభుగారు, మరొకరు షకీల్‌గారు. దర్శకుడు మాక్.. ఎప్పుడూ కంగారుగా ఉండేవారు. ఇప్పుడు కాస్త వైట్ డ్రస్సులో ప్రశాంతంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో కనకం పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో భయపెట్టడానికి ప్రయత్నించాను. ప్రేక్షకులు భయపడటానికి ప్రయత్నం చేయండి. థియేటర్లకి వచ్చి ఈ సినిమాని చూడండి.. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓటీటీలో వస్తుంది కదా.. అని వెయిట్ చేయకండి అని అన‌సూయ పేర్కొంది.మ‌రోవైపు అన‌సూయ టీవీ షోల‌తోను తెగ ర‌చ్చ చేస్తున్న విష‌యం విదిత‌మే.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp