Anasuya Bharadwaj : అది మాత్రం చాలా కష్టమట.. అనసూయ బాధ వర్ణనాతీతం
Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. బుల్లితెర, వెండితెర, ఓటీటీ ఇలా అన్నింట్లోనూ అనసూయ వేలు పెట్టేసింది. అంతే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లోనూ కనిపించేందుకు రెడీ అయిందట. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు అనసూయ చావు కబురు చల్లగా అనే సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోందట. మూడు నిమిషాల నిడివి కోసం 20 లక్షలు చార్జ్ చేస్తుందట. మొత్తానికి ఈ వార్తలు మాత్రం అనసూయ క్రేజ్‌కు నిదర్శనంగా మారాయి.
అలా నిత్యం బిజీగా ఉండే అనసూయకు ఇంట్లోనూ పనులుంటాయి. పైగా ఈ మధ్య అనసూయ వర్కవుట్లు చేస్తూ ఎంతో బిజీగా ఉంటుంది. అంతే కాకుండా వీకెండ్ వస్తే చాలు భర్తతో కలిసి మరీ వర్కవుట్లు చేస్తుంటుంది. ఫేస్‌కు సంబంధించిన వ్యాయామాలు కూడా చేస్తోంది. శరీరాకృతిని కూడా మార్చుకునే పనిలో పడింది అనసూయ. అయితే అనసూయ అక్కడా ఇక్కడా పని చేయడం గురించి మాట్లాడుతూ తన బాధను చెప్పుకొచ్చింది.

Anasuya Bharadwaj About Her workouts
అనసూయ బాధ వర్ణనాతీతం.. Anasuya Bharadwaj
రోజంతా షూటింగ్ చేయాల్సి ఉంటుందని తెలిసినప్పుడు వర్కవుట్లు చేయడమనేది చాలా కష్టమంటూ అనసూయ చెప్పుకొచ్చింది. అసలే ఇప్పుడు అనసూయ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలతో బిజిబిజీగా ఉంటుంది. కరోనా వల్ల ఏర్పడిన నష్టాలను ఇప్పుడు పూడ్చుకోవాలని అనసూయ చూస్తున్నట్టుంది. అందుకే వచ్చిన అవకాశన్నల్లా వాడుకుంటోంది. అయితే ఐటం సాంగ్‌లో అనసూయ రెమ్యూనరేష్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై అనసూయ స్పందిస్తుందో లేదో చూడాలి.