అనసూయ, బాబా భాస్కర్ ఒకే గూటి పక్షులు..అలా ఇద్దరి పరువుపాయే

Authored By Admin | The Telugu News | Updated on : 18 December 2020, 12:25 pm

అనసూయ, బాబా భాస్కర్‌లో ఓ సారూప్యత కనిపిస్తుంటుంది. ఈ ఇద్దరూ అక్కడా ఇక్కడా ఎక్కడా అనే తేడా లేకుండా అన్ని ఈవెంట్లలో కనిపిస్తుంటారు. స్టార్ మా, జెమినీ, జీ, ఈటీవీ ఇలా ప్రతీ చానెల్ స్పెషల్ ఈవెంట్లలో అనసూయ, బాబా భాస్కర్‌లు కనిపిస్తుంటారు. ఈ మధ్య జీ, స్టార్ మాలో ఎక్కువగా కనిపిస్తున్నాడు. అంతకు ముందు ఢీ, జబర్దస్త్‌ల్లోనూ బాబా రచ్చ చేశాడు. తాజాగా మరో ఈవెంట్‌లో అందరూ కలిసి దుమ్ములేపేందుకు రెడీ అయ్యారు.

DJ 2021 New Year Special Event Anasuya And Baba Bhaskar Funny Conversation

DJ 2021 New Year Special Event Anasuya And Baba Bhaskar Funny Conversation

కొత్త ఏడాది రాబోతోన్న సందర్భంగా ఢీ, జబర్దస్త్ టీంలు కలిసి స్పెషల్ ఈవెంట్లు చేసేందుకు రెడీ అయ్యారు. దాని కోసం చిన్న డ్రామాను క్రియేట్ చేశాడు. ఢీ స్టేజ్ కావాలని జబర్దస్త్ టీం ధమ్ కీ ఇవ్వడం, ఢీ కంటెస్టెంట్లను కిడ్నాప్ చేశామంటూ జబర్దస్త్ సభ్యులు బెదిరించడం, తిరిగి ఢీ టీం కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చాడు. ఇలా ఢీ జబర్దస్త్ కొట్టుకోబోతోన్నట్టు డీజే అనే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన మరో ప్రోమోను వదిలారు.

అందులో బాబా భాస్కర్ కర్రతో ఎంట్రీ ఇచ్చి ఓ రేంజ్‌లో బిల్డప్ ఇచ్చాడు. కర్ర ఎందుకు పట్టుకున్నారంటూ అనసూయ అడగడం.. బాబా భాస్కర్ దానికి ఏదో రకమైన సమాధానం చెప్పుకుంటూ కవర్ చేశాడు. ఈ సెట్ వారు ఇక్కడ.. ఆ సెట్ వారు అక్కడ ఉండాలని బాబా భాస్కర్ చెబితే.. మరి మీరేంటీ అక్కడక్కడా అలా పది రకలా సెట్‌లలో కనిపిస్తున్నారంటూ అనసూయ పంచ్ వేసింది. అది మీకెలా తెలుసు అని బాబా భాస్కర్ ఆశ్చర్యపోతుంటే.. ప్రదీప్ మధ్యలో దూరి అనసూయ పరువు తీసేశాడు. మీరు తిరిగిన పది సెట్‌లలో ఆమె కూడా ఐదారు తిరిగేసిందంటూ అనసూయ, బాబా మాస్టర్‌ల గాలి తీసేశాడు ప్రదీప్. మొత్తానికి ఈ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గట్టిగానే ఉండేలా కనిపిస్తున్నాయి.

Advertisement

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి