ఇలాంటి పరిస్థితిలోనూ అలా.. అనసూయ డేరింగ్ స్టెప్

0
Advertisement

Anasuya Bharadwaj : అనసూయ ఇప్పుడు ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు బుల్లితెర, మరో వైపు వెండితెర ప్రాజెక్ట్‌లతో రచ్చ చేస్తోంది. కోలీవుడ్, మాలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఒక్క ఇండస్ట్రీలో అనసూయ అడుగుపెట్టబోతోంది. ఇక తెలుగులో అయితే అనసూయ చేతినిండా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇందులో రెడీగా ఓ సినిమా ఉంది. అయితే వెండితెరపై రావాల్సిన ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ అడ్డు తగిలింది. గర్భవతిగా అనసూయ నటించిన థ్యాంక్యూ బ్రదర్ మూవీ ఓటీటీలో రాబోతోంది.

ఇలాంటి నిర్ణయం కూడా ప్రేక్షకుల కోసమే తీసుకున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో ప్రమోషన్ చేయించుకున్నారు. టీజర్, ట్రైలర్ అన్నీ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇలా చివరకు ఓటీటీలో సినిమాను విడుదల చేయబోతోన్నారు. ఈ మేరకు అనసూయ తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఇందులో థ్యాంక్యూ బ్రదర్ సినిమాకు సంబంధించిన ప్రకటనను చేసింది. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj : ఇలాంటి పరిస్థితిలోనూ అలా.. అనసూయ డేరింగ్ స్టెప్

ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ మూవీని ఇలా ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అయ్యాం. ఆహాలో మా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.,. మే 7 నుంచి ఆహాలో ఈ మూవీ అందుబాటులోకి రానుందని అనసూయ ప్రకటించింది. అనసూయ ఇప్పుడు రవితేజ ఖిలాడీ, అల్లు అర్జున్ పుష్ప సినిమాలతో బిజీగా ఉంది. మళయాలంలో మమ్ముట్టి హీరోగా వస్తోన్న సినిమాలో ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది.

Advertisement