Anasuya : భ‌ర్త ప‌రువు తీసిన అన‌సూయ‌.. మ‌గాళ్లతో ప‌నేంటి అంటూ కామెంట్

Authored By Sam C | The Telugu News | Published on: March 25, 2022, 7:43 pm

Anasuya : యాంక‌ర్‌గా, న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న అన‌సూయ సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. బుల్లితెరపై ఈ యాంకరమ్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు బుల్లితెరపై అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై కూడా సత్తా చాటుతోంది అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రతో నటనపరంగా ప్రశంసలు అందుకున్న అనసూయ.. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో దాక్షయణి పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ అమ్మ‌డి ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. సోషల్ మీడియాలోనూ అనసూయ ఫుల్ యాక్టివ్.. ఎప్పుడూ లేటేస్ట్ ఫోటోస్.. సినిమా అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే అనసూయకు ట్రోల్స్ కూడా కొత్తేమి కాదు.

తాజాగా అనసూయ షేర్ చేసిన ఓ వీడియో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. సదరు వీడియోలో ఆమె భర్త కూడా ఉండగా.. అసలు మగాళ్లతో అవసరమేంటి..? అంటూ ప్రశ్నించారు. అలాంటి బోల్డ్ కామెంట్ చేసిన అనసూయ… జస్ట్ జోక్ అంటూ సమర్ధించుకుంది. ఫెమినిస్ట్ అని చెప్పుకునే అనసూయ ఇలాంటి వీడియో చేయడం ఆసక్తికరంగా మారింది. అన‌సూయ ఎవరైనా మహిళకు అన్యాయం జరిగిందని తెలిస్తే సోషల్ మీడియా వేదికగా తన గొంతు విప్పుతారు. అలాగే తన బట్టలపై ఎవరైనా కామెంట్స్ చేస్తే అసలు ఊరుకోరు. ఇప్పుడు మ‌గాళ్ల‌పై ఈమ చేసిన కామెంట్స్ వైర‌ల్ కాగా, దీనిపై మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తుంది.

Anasuya comments on her husband

Anasuya comments on her husband

Anasuya : అన‌సూయ మాముల్ది కాదు..

బుల్లితెర బ్యూటీగా, గ్లామర్ యాక్ట్రెస్ గా యాంకర్ అనసూయ కేరీర్ లో దూసుకుపోతోంది. పుష్ప మూవీ తర్వాత తగ్గేదే లే అంటోంది. వరుస సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతూ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ ఓ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ లోనూ నటించింది. అనసూయ అందానికి ఆడియెన్స్ ఎంతలా అట్రాక్ట్ అవుతారో తెలియందీ కాదు. అప్పట్లో ఆమె పేరుపైనే ఓ సాంగ్ కంపోజ్ చేశారు. ‘సూయా..సూయా.. అనసూయా.. అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా’ అంటూ వచ్చిన స్పెషల్ సాంగ్ సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ మూవీకి అట్రాక్షన్ గా నిలిచింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp