Anasuya : ‘నాకు లైన్ వేసేవాడు , అందుకే దూరం పెట్టాను ‘… అడవి శేష్ పై అనసూయ కామెంట్స్..!!

Authored By aruna | The Telugu News | Published on: November 4, 2023, 7:00 pm

Anasuya : ఒకప్పటి బుల్లితెర యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్ గా మారారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే పెద్దకాపు -1, ప్రేమ విమానం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించారు. ఏ సినిమాలో అయినా తన పాత్ర ప్రత్యేకమైనది అయితేనే చేస్తాను అని కరాకండిగా అనసూయ చెబుతున్నారు. అయితే తాజాగా అనసూయ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కుటుంబ నేపథ్యం, చదువు, తాను కెరీర్ మొదలుపెట్టిన తీరు అన్నింటి గురించి చెప్పారు. అనసూయ బుల్లితెరపై యాంకర్ గా మంచి క్రేజ్ నప తెచ్చుకున్నారు. ఆ తర్వాత నాగార్జున ‘ సోగ్గాడే చిన్నినాయన ‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

అయితే తాను తొలి సంతకం చేసిన సినిమా మాత్రం ‘ క్షణం ‘ అని చెప్పారు. 2013లో అనసూయ యూఎస్ టూర్ చేశారట. ఆ టైంలో హీరో అడవి శేషు ఆమెను కలిశారట. అయితే అనసూయ హీరోలందరూ లైన్ వేయడానికి వస్తారు అని అడవి శేష్ ను దూరం పెట్టేసిందట. మూడు నాలుగు నెలల తర్వాత కాఫీ షాప్ లో అనుకోకుండా అనసూయ అడవి శేషు కలిశారట. నువ్వు అసలు దొరకటం లేదని కూర్చోబెట్టి అడవి శేషు అనసూయకు నెరేషన్ ఇచ్చారట. ఈ పాత్రకు శేష్ నన్ను ఎందుకు అనుకున్నాడో అప్పుడు అర్థమైంది.

Anasuya comments on hero Adivi Sesh

Anasuya comments on hero Adivi Sesh

నేను జబర్దస్త్ లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ లో ఏదో ఎక్స్ప్రెషన్లో సీరియస్ గా చూసాను అంట. దీంతో అడవి శేషు పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం అనసూయను అప్రోచ్ అయ్యారట. ఆ సమయంలో అడవి శేషు చాలా ఇబ్బందులు పడ్డాడని, చాలా కష్టపడి పైకి వచ్చారని అనసూయ చెప్పుకొచ్చారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో మా మహాలక్ష్మి డైలీ షోకు రోజు వెళ్లే దాన్ని, లంగా వోణి చీరలు ఎప్పుడు కట్టుకునే దాన్ని అని చెప్పారు. ఆ టైంలో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తనను రెగ్యులర్గా చూసే వారని, దీంతో ‘ సోగ్గాడే చిన్నినాయన ‘ సినిమాలో అవకాశం ఇచ్చారని అనసూయ చెప్పుకొచ్చారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp