Anasuya : అనసూయ అసలు పేరు తెలిస్తే.. మీకు షాక్..!
Anasuya : అటు బుల్లితెర, ఓటీటీ , ఇటు వెండితెరపై బుల్లెట్‌లా దూసుకుపోతోంది అందాల ముద్దుగుమ్మ అనసూయ. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూనే వెండితెరపైన పవర్ ఫుల్ రోల్స్ ప్లే చేస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. అనసూయకు అసలు వాళ్ల అమ్మా నాన్న పెట్టాలనుకున్న పేరు ఏంటంటే..యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అటు వ్యక్తిగత జీవితాన్ని ఇటు వృత్తి జీవితాన్ని రెండిటినీ బ్యాలెన్స్ చేస్తోంది.
Anasuya : అనసూయకు ఆ పేరే పెట్టాలని పట్టుబట్టిన అనసూయ నాన్న..

anasuya do you know the original name of anchor anasuya
అనసూయకు యాక్చువల్‌గా వాళ్ల అమ్మా నాన్న ముందు పెట్టాలనుకున్న పేరు ‘పవిత్ర’. వాళ్ల అమ్మ ఆ పేరు పెట్టాలనుకుని డిసైడ్ అయింది కూడా. కానీ, అనసూయ వాళ్ల నాన్న తరఫున ముగ్గురు అన్నదమ్ముల ఫ్యామిలీలో అనసూయ అనే ఆడిపిల్ల ఒకరే ఉన్నారని, ఈ క్రమంలోనే వాళ్ల నాన్న‘అనసూయ’ అనే పేరు పెట్టాలని పట్టుబట్టాడట.అది వాళ్ల నానమ్మ పేరు కాబట్టి కచ్చితంగా ఆ పేరే ఉండాలని నిర్ణయించుకున్నాడు.
అలా ఆమె పేరు అనసూయగా ఫిక్స్ అయిపోయింది. అయితే, అనసూయకు ఒరిజినల్‌గా ఉండాల్సిన నేమ్ ‘పవిత్ర’. కానీ, అది మిస్ అయి అనసూయ అయింది. ఇకపోతే అనసూయ తన హైట్ జస్ట్ 5.9 అని పేర్కొంటుడటం గమనార్హం. అనసూయ నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ గ్లామర్ ప్లస్ స్కిన్ షోలో ఎప్పుడూ ముందుంటుంది. చిన్న పిల్లలాగా చలాకీగా ఉంటూ యాంకరింగ్‌లో మంచి పేరు సంపాదించుకుంది. అనసూయకు సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో చాన్స్ రావడంతో తన కెరీర్ మారిపోయిందని చెప్పొచ్చు.
ఈ ఫిల్మ్‌లో అనసూయ పోషించిన ‘రంగమ్మత్త’ పాత్ర ఆమె కెరీర్‌లోనే ఒక మైలు రాయి అని పేర్కొనవచ్చు. ప్రజెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో దాక్షాయణిగా అనసూయ భరద్వాజ్ నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు ‘రంగమార్తాండ, ఖిలాడి’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నది. ఇకపోతే వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలోనూ అనసూయ కీలక పాత్రలో కనిపించనుంది.