Anasuya : భయమన్నది తెలియని దాక్షాయనిగా అనసూయ.. ‘పుష్ప’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..
Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా సందడి చేస్తూనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్.. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తునన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’లో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు.

anasuya first look from pushpa Movie
సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ చిత్రంలో ‘రంగమ్మత్త’గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న అనసూయ.. ఈ సారి నెగెటివ్ షేడ్స్‌లో కనబడబోతున్నట్లు తెలుస్తోంది. ‘పుష్ప’ మేకర్స్ ట్విట్టర్ వేదికగా రివీల్ చేసిన ఫస్ట్ లుక్‌లో అనసూయ భయమేంటో ఏంటో తెలియని ‘దాక్షాయని’గా కనబడుతోంది. అహంకారం, గర్వంతో ఉండే మహిళగా కనబడుతూనే నెగెటివ్ రోల్ సినిమా ప్లే చేయబోతున్నదని లుక్ చూస్తుంటే అర్థమవుతోంది.
Anasuya : నెగెటివ్ షేడ్స్‌లో అదరగొట్టబోతున్న అనసూయ..

anasuya first look from pushpa Movie
మెడలో ఆభరణాలతో పాటు కడెం లాంటి ఆభరణం వేసుకుని చేతిలో చిమ్మట పట్టుకుని చీర కట్టులో అనసూయ లుక్.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ లుక్ చూసి ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి కూడా అనసూయ అదరగొడుతుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.