Anasuya : హోయలు పోతూ కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న అనసూయ.. ఆ అందాలకు ముగ్ధులు కాని వారుంటారా..!
Anasuya : ముందుగా తన కెరీర్‌ని న్యూస్ రీడర్‌గా మొదలు పెట్టిన అనసూయ ఆ తర్వాత జబర్ధస్త్ షోకి యాంకర్‌గా చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అనసూయ, సినిమాల్లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ‘ఎప్పుడొచ్చామన్నది కాదు’ అన్నట్లు లేటుగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అనసూయ వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక బుల్లి తెర షోలతో నిత్యం ప్రేక్షకులకు టచ్‌లో ఉండే అందాల అనసూయ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ టన్నుల కొద్ది లైక్‌లను తన ఖాతాలో వేసుకుంటుంటారు.
ఎప్పుడు తన గ్లామర్‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉండే అనసూయ తాజాగా తన ఫ్యామిలీ పిక్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇందులో అనసూయ భర్తతో పాటు తన తండ్రి,తల్లి కూడా ఉన్నారు.ఎంతో సరదగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తుంది. మరో వీడియోలో అనసూయ తెగ హోయలు పోతూ కనిపించింది. చూడీ దార్‌లో ఈ అమ్మడు మరింత అట్రాక్టివ్‌గా ఉంది. చూడచక్కని అందంతో కుర్రాళ్లకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్రస్తుతం అనసూయ స్టన్నింగ్ వీడియోపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

anasuya glamorous video viral
Anasuya : అనసూయ స్టైలే వేరు..
ఇటీవల ‘అనసూయ 40 ఏళ్ల వయసులోనూ.. ఎక్స్‌పోజింగ్‌కు వెనుకడుగు వేయదంటూ’ ఓ వార్త ప్రచురితమైంది. ఈ విషయం కాస్త అనసూయ దృష్టికి రావడంతో ఘాటుగా స్పందించింది.. ‘నేను 40 ఏళ్లు కాదు, నా వయసు 36 ఏళ్లు. వయసు అనేది పెరుగుతూనే ఉంటుంది, ఆ నిజాన్ని దాచుకోవాల్సిన అవసరం నాకు లేదు’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాకుండా సదరు వార్త రాసిన వారిని ఉద్దేశిస్తూ.. ‘మీరు మీ పనిని నిజాయితీతో, విలువలతో చేయండి. గుడ్ లక్’ అంటూ హితవు పలికారు అనసూయ. ఇలా తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్‌పై కూడా అనసూయ ఎంతో హుందాగా స్పందించారు.
View this post on Instagram