Ram Charan : ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్లే రామ్ చరణ్ ను నిర్మాతలు పక్కన పెట్టారా?
Ram Charan : సాధారణంగా ఏ రంగంలో ఉన్నవారికి అయిన హిట్స్ విజయాలు ఉన్నంతవరకే క్రేజ్ ఉంటుంది. ఇది అన్ని రంగాల వారితో పాటు సినీరంగం వారికి కూడా వర్తిస్తుంది అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు, సెలబ్రిటీల విషయానికి వస్తే సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్కరి లైఫ్ లో అయినా ఒక్క ఫ్లాప్ సినిమా పడింది అంటే చాలు ఎంత ఎత్తులో ఉన్న కూడా పాతాళంలోకి పడిపోతారు. అలా ఊహించని విధంగా రాత్రికి రాత్రే జీవితాలు తారుమారు అవుతూ ఉంటాయి. అదేవిధంగా వరుస ఫ్లాప్ లో ఉన్నవారికి ఒక్క హిట్ సినిమా పడింది అంటే చాలు వెంటనే ఫామ్ లోకి వస్తారు.
అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకరు. మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. మొదట చిరుత సినిమా తరువాత దాదాపు మూడేళ్ళ పాటు గ్యాప్ తీసుకుని రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. మగధీర సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ సమయంలో స్టార్ హీరోలు రామ్ చరణ్ ని చూసి షాక్ అయ్యే రేంజ్ కు వెళ్లి పోయాడు రామ్ చరణ్. ఇక అదే జోష్ తో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ సినిమా చేసి దారుణంగా పరాజయాన్ని చవిచూశాడు. రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా ఏడాదిపాటు థియేటర్లలో ఆడితే, ఆరెంజ్ సినిమా మాత్రం కేవలం వారం రోజులు మాత్రమే థియేటర్లలో ఆడింది.
ఆరెంజ్ సినిమా బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. అదేవిధంగా నిర్మాత నాగబాబు కూడా ఆర్థికంగా దెబ్బతిని చాలా రోజుల వరకు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా భారీగా పరాజయాన్ని చవి చూడటంతో రామ్ చరణ్ నైరాశ్యంలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో దర్శక నిర్మాతలు ఎవరూ కూడా రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ముందుకు రాలేదట. అసలు నిర్మాతలు ఎవరూ తన వద్దకు వచ్చి సినిమా చేస్తానని కూడా అనలేదు అని ఆ నాటి సంఘటలను గుర్తు చేసుకుని ఏమో ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యాడు రామ్ చరణ్.
Ram Charan : ఆరెంజ్ సినిమా ప్లాప్ తర్వాత ఆ ఒక్క దర్శకుడే రామ్ చరణ్ కు సపోర్ట్ చేశాడా?
ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తన వద్దకు వచ్చి సినిమా చేయాలని కోరింది కేవలం ఆర్.బి.చౌదరి మాత్రమే అని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్. ఆ విషయం పట్ల ఎప్పటికీ తాను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతానని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను ఎప్పుడూ కూడా అలాంటి దర్శకుడితో సినిమా చేయాలనే, ఇలాంటి దర్శకుడితో సినిమా చేయాలని అనుకోలేదని.. ఎవరు వచ్చి కథ చెప్పినా కూడా.. కథ నచ్చితే ఓకే చేశాను అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.