Home » Entertainment » Anasuya Is Acting With Chiranjeevi
Entertainment

Anasuya: ఏకంగా చిరంజీవితోనే అనసూయ..ఏం చేస్తుందో మళ్ళీ ఛాన్స్ రాదుగా..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: August 27, 2021, 3:58 pm
Advertisement

Anasuya: గత కొంత కాలంగా యాంకర్ కం నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ బాగా పెరిగిపోతోంది. బుల్లితెర మీద పాపులారిటీ వల్ల సినిమాలలో అవకాశాలు అందుకున్న ఆమె చేసే ప్రతీ పాత్రతో బాగా మెప్పిస్తుంది. బుల్లితెర మీద షో నవ్వుతూ..అవసరానికి తగ్గ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటే ఇంతకన్నా ఈమె ఏం చేస్తుందిలే అనుకున్నారు. అంతేకాదు గుంటూరు టాకీస్ సినిమాలో యాంకర్ రష్మీ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలో రష్మీ బోల్డ్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. ఇక రష్మీకీ టాలీవుడ్‌లో తిరుగుండదు. ఇక రష్మీ యాంకర్‌గా మానేసి హీరోయిన్‌గా క్రేజీ ఆఫర్ అందుకొని సెటిలవుతుందని చెప్పుకున్నారు.

Advertisement

anasuya-is acting with chiranjeevi

అదే సమయంలో అనసూయని రష్మీతో పోల్చిన కొందరు ఎప్పటికీ అనసూయ ఇలా బుల్లితెరమీద సందడి చేస్తూ ఉండిపోవాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే అనసూయ కూడా క్షణం సినిమాలో పోలీస్ పాత్రలో నటించే అవకాశం అందుకుంది. ఇది గ్లామర్ రోల్ కాకపోయినా బాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, రంగస్థలం సినిమాలలో ఛాన్స్‌లు దక్కించుకుంది. ఈ సినిమాలతో నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో అనసూయ పోషించిన రంగమ్మ క్యారెక్టర్ మైల్ స్టోన్ మూవీలా నిలిచింది.

Advertisement

 

Anasuya: మెగాస్టార్‌తో కలిసి తెరను పంచుకోబోతుండటం గొప్ప విషయం..!

anasuya-is acting with chiranjeevi

Advertisement

దాంతో ఇప్పుడు కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అనసూయ తోనే చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రవితేజ ఖిలాడి సినిమాతో పాటు, రంగ మార్తాండ, పుష్ప లాంటి పాన్ ఇండియన్ సినిమాలున్నాయి. ఇవి కాకుండా తాజగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటించే అవకాశం అందుకుందని టాక్ మొదలైంది. ఇందులో మంజు వారియర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. దాదాపు ఈ పాత్రకి అనసూయ ఫైనల్ అయినట్టే అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇదే నిజమైతే అనసూయకి ఏకంగా మెగాస్టార్‌తో కలిసి తెరను పంచుకోబోతుండటం గొప్ప విషయం అని చెప్పాలి. దీనిపై అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

 

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి