Anasuya: ఏకంగా చిరంజీవితోనే అనసూయ..ఏం చేస్తుందో మళ్ళీ ఛాన్స్ రాదుగా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya: ఏకంగా చిరంజీవితోనే అనసూయ..ఏం చేస్తుందో మళ్ళీ ఛాన్స్ రాదుగా..?

Anasuya: గత కొంత కాలంగా యాంకర్ కం నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ బాగా పెరిగిపోతోంది. బుల్లితెర మీద పాపులారిటీ వల్ల సినిమాలలో అవకాశాలు అందుకున్న ఆమె చేసే ప్రతీ పాత్రతో బాగా మెప్పిస్తుంది. బుల్లితెర మీద షో నవ్వుతూ..అవసరానికి తగ్గ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటే ఇంతకన్నా ఈమె ఏం చేస్తుందిలే అనుకున్నారు. అంతేకాదు గుంటూరు టాకీస్ సినిమాలో యాంకర్ రష్మీ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలో రష్మీ బోల్డ్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. […]

 Authored By govind | The Telugu News | Updated on :27 August 2021,8:00 am

Anasuya: గత కొంత కాలంగా యాంకర్ కం నటి అనసూయ భరద్వాజ్ క్రేజ్ బాగా పెరిగిపోతోంది. బుల్లితెర మీద పాపులారిటీ వల్ల సినిమాలలో అవకాశాలు అందుకున్న ఆమె చేసే ప్రతీ పాత్రతో బాగా మెప్పిస్తుంది. బుల్లితెర మీద షో నవ్వుతూ..అవసరానికి తగ్గ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటే ఇంతకన్నా ఈమె ఏం చేస్తుందిలే అనుకున్నారు. అంతేకాదు గుంటూరు టాకీస్ సినిమాలో యాంకర్ రష్మీ హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలో రష్మీ బోల్డ్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ బాగా ఎగ్జైట్ అయ్యారు. ఇక రష్మీకీ టాలీవుడ్‌లో తిరుగుండదు. ఇక రష్మీ యాంకర్‌గా మానేసి హీరోయిన్‌గా క్రేజీ ఆఫర్ అందుకొని సెటిలవుతుందని చెప్పుకున్నారు.

anasuya is acting with chiranjeevi

anasuya-is acting with chiranjeevi

అదే సమయంలో అనసూయని రష్మీతో పోల్చిన కొందరు ఎప్పటికీ అనసూయ ఇలా బుల్లితెరమీద సందడి చేస్తూ ఉండిపోవాల్సిందే అంటూ కామెంట్స్ చేశారు. కట్ చేస్తే అనసూయ కూడా క్షణం సినిమాలో పోలీస్ పాత్రలో నటించే అవకాశం అందుకుంది. ఇది గ్లామర్ రోల్ కాకపోయినా బాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, రంగస్థలం సినిమాలలో ఛాన్స్‌లు దక్కించుకుంది. ఈ సినిమాలతో నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో అనసూయ పోషించిన రంగమ్మ క్యారెక్టర్ మైల్ స్టోన్ మూవీలా నిలిచింది.

 

Anasuya: మెగాస్టార్‌తో కలిసి తెరను పంచుకోబోతుండటం గొప్ప విషయం..!

anasuya is acting with chiranjeevi

anasuya-is acting with chiranjeevi

దాంతో ఇప్పుడు కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అనసూయ తోనే చేయించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రవితేజ ఖిలాడి సినిమాతో పాటు, రంగ మార్తాండ, పుష్ప లాంటి పాన్ ఇండియన్ సినిమాలున్నాయి. ఇవి కాకుండా తాజగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటించే అవకాశం అందుకుందని టాక్ మొదలైంది. ఇందులో మంజు వారియర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. దాదాపు ఈ పాత్రకి అనసూయ ఫైనల్ అయినట్టే అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇదే నిజమైతే అనసూయకి ఏకంగా మెగాస్టార్‌తో కలిసి తెరను పంచుకోబోతుండటం గొప్ప విషయం అని చెప్పాలి. దీనిపై అప్‌డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

 

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది