Anasuya : పాపం అనసూయ ఈ పండగకి కూడా కనిపించలేదు.. ఎక్కడున్నారు మేడం?

 Authored By prabhas | The Telugu News | Updated on :13 January 2023,1:40 pm

Anasuya : పండగ ఏదైనా.. ప్రత్యేక రోజు ఏదైనా ఈటీవీలో కచ్చితంగా మల్లెమాల వారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా కొత్త సంవత్సరం సందర్భంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు, అలాగే ఈ సంక్రాంతికి పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అనసూయ ఎక్కడా కనిపించక పోవడంతో ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు జబర్దస్త్ కార్యక్రమంలో అనసూయ చేసే సమయంలో ప్రతి ఒక్క ప్రత్యేక కార్యక్రమంలో కూడా అనసూయ ఉండేది. ఆ సమయంలో అనసూయ యొక్క అభిమానులు ఆనందం వ్యక్తం చేసేవారు, కానీ ఈ మధ్య కాలంలో

అనసూయ ఈటీవీ మరియు మల్లెమాల కి దూరమైంది. ఇతర చానల్స్ లో కూడా ఈమె కనిపించక పోవడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా సినిమాల్లో నటిస్తున్నాను అంటూ మల్లెమాల వారికి క్షమాపణలు చెప్పి, జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పేసింది. కానీ సినిమా లతో కూడా ఇప్పటి వరకు అనసూయ సందడి చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. వేరే ఛానల్ నుండి భారీ ఆఫర్ రావడంతో జబర్దస్త్ వదిలేసిన అనసూయ ఇప్పుడు అక్కడ కూడా అవకాశాలు లేక పోవడంతో దిక్కులు చూస్తుంది అంటూ స్వయంగా

Anasuya missing every special event and program in etv

Anasuya missing every special event and program in etv

అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ విమర్శలు గొప్పిస్తున్నారు. గతంలో అనసూయ యొక్క స్థాయి ఏంటి ఇప్పుడు ఆమె స్థాయి ఏంటి అంటూ కొందరు బెరీజు వేసుకునే ప్రచారం చేస్తున్నారు. ఈటీవీలో అనసూయ కనిపిస్తే ఆమె లెవెల్ వేరు కానీ, ఇప్పుడు ఎక్కడ కనిపించక పోవడంతో ఇటీవల ఆమెను సోషల్ మీడియాలో మాత్రమే చూడాల్సిన పరిస్థితి వచ్చిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడం ఎక్కడున్నారు అంటూ ఆమె సోషల్ మీడియా పోస్ట్ లకు అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఏదో ఒక సమయంలో అనసూయ ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతుందేమో చూడాలి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి