Anasuya : మరో క్రేజీ సినిమాలో డిఫరెంట్ లుక్ లో అనసూయ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : మరో క్రేజీ సినిమాలో డిఫరెంట్ లుక్ లో అనసూయ !

 Authored By prabhas | The Telugu News | Updated on :13 March 2022,3:31 pm

Anasuya : ‘పేపర్ బాయ్’ఫేమ్‌ జయశంకర్‌ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్‌ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్‌ బ్యానర్‌పై  ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. సాయికుమార్‌, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్‌ రెడ్డి, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనుప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ…జయశంకర్‌ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని కొనియాడారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని  ఏప్రిల్‌లోపు కంప్లీట్‌ చేస్తామని చెప్పారు. శ్రీనివాస్‌ రెడ్డి, చమ్మక్‌ చంద్రకు సంబంధించిన సీన్స్‌ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని, థియేటర్స్‌లో ఆ సీన్స్‌ తప్పకుండా నవ్వులు పూయిస్తాయని చెప్పారు.

Anasuya Next movie in Different look

Anasuya Next movie in Different look

జయశంకర్‌ వర్కింగ్‌ స్టెల్‌ చాలా బాగుందని, అందుకే ఆయనతో మరో సినిమాను కూడా ప్లాన్‌ చేస్తున్నామని తెలిపారు. ఇక దర్శకుడు జయశంకర్‌ మాట్లాడుతూ.. నిర్మాతల ప్రొత్సాహంతో సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. తమ చిత్రానికి అనూప్‌ సంగీతం చాలా ప్లస్‌ అవుతుందన్నారు. టైటిల్‌తో పాటు విడుదల తేదిని కూడా త్వరలోనే వెల్లడిస్తామని జయశంకర్‌ చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రానికి ‘గ్రహమ్‌’అని టైటిల్‌ ఖరారు చేసినట్లు సమాచారం.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది