Anasuya : యాంకర్ అనసూయ బంగారం రా నిజంగా.. అస్సలు మిస్ అవ్వకూడని న్యూస్ !
Anasuya : యాంకర్ అనసూయ తెలుసు కదా. తన గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఇప్పుడు జబర్దస్త్ లో లేకపోయినా.. జబర్దస్త్ తనకు లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ ద్వారానే తను లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత తనకు సినిమా అవకాశాలు, ఇతర టీవీ షోలలో అవకాశాలు రావడంతో ఫుల్ బిజీ అయిపోయింది. చాలా ఏళ్ల పాటు జబర్దస్త్ లో యాంకరింగ్ చేసిన అనసూయ తర్వాత జబర్దస్త్ ను మానేసింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో తన అభిమానులకు మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటోంది అనసూయ.
తాజాగా తను సంక్రాంతి సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి అనసూయ సంక్రాంతి పండుగను జరుపుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భర్త, పిల్లలతో కలిసి పతంగులను అనసూయ ఎగురవేసింది. సంక్రాంతి సందర్భంగా అనసూయ ఆరెంజ్ కలర్ చీర కట్టుకుంది. పింక్ బ్లౌజ్ వేసుకుంది. నిజానికి అనసూయ ఎక్కువగా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికే ఆసక్తి చూపిస్తుంటుంది. చాలా హోమ్లీగా ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్న అనసూయ ఫోటోలను చూసి నెటిజన్లు అయితే తనను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
Anasuya : ఆ ఫోటోలను షేర్ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన అనసూయ
అయితే.. అనసూయ ఆ ఫోటోలను షేర్ చేసి మరీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది. నిజానికి.. అనసూయకు టాలీవుడ్ లో ఉన్న రేంజ్ మామూల్ది కాదు. ఒక స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ ఉంది తనకు. అందుకే.. తనను సినిమాల్లో తీసుకోవడం కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు. నిజానికి తను పెద్ద పెద్ద సినిమాల్లో నటించింది. తను నటించిన పుష్ప సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2 లోనూ కీలక పాత్రలో నటిస్తోంది. ఆ తర్వాత కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న రంగ మార్తాండ సినిమాలోనూ అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది.