Sudigali Sudheer : సుధీర్ క్రేజ్ చూసి నోరెళ్ల‌పెట్టిన అన‌సూయ‌.. అట్లుంటది మ‌రీ మ‌నోడితోని..!

Authored By Sam C | The Telugu News | Published on: August 15, 2022, 7:40 pm

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్.. ఈ పేరు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బుల్లితెరతోనే విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. తక్కువ టైంలోనే సెలెబ్రిటీగా మారిపోయాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సుధీర్ స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ వరుస షోలతో సందడి చేస్తోన్నాడు. మెజీషియన్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన అతడు.. ఆ తర్వాత టీమ్ లీడర్‌గా ఎదిగాడు.

Sudigali Sudheer : సుధీర్ క్రేజ్ ఇలా ఉంటుందా?

ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యాడు. మొత్తానికి కెరీర్‌ను మాత్రం సుధీర్ జబర్ధస్త్‌గా నడుపుకున్నాడు. ఇప్పుడు సుధీర్‌ మెయిన్‌ లీడ్‌గా చేస్తున్న చిత్రం `వాంటెడ్‌ పండుగాడ్‌`. కె. రాఘవేంద్రరావు సమర్పణలో, శ్రీధర్‌ సీపాన రూపొందించిన చిత్రమిది. ఇందులో సుడిగాలి సుధీర్‌, సునీల్‌, అనసూయ, దీపికా పిల్లి వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక జ‌ర‌గ‌గా, ఈ కార్య‌క్ర‌మంలో సుడిగాలి సుధీర్ క్రేజ్ ఏంటో బ‌య‌ట ప‌డింది. రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడిన తర్వాత సుడిగాలి సుధీర్‌కి మైక్‌ ఇవ్వగా మరోసారి రెచ్చిపోయారు అభిమానులు.

Anasuya Shoked After Seeing Sudigali Sudheer Craze In Youth

Anasuya Shoked After Seeing Sudigali Sudheer Craze In Youth

పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల తరహాలో అరుపులతో మోతమోగించారు. దీంతో ప్రాంగణం మొత్తం దద్దరల్లినంత పనైంది. సుడిగాలి సుధీర్‌కి ఈ రేంజ్‌ ఫాలోయింగ్‌ ని చూసి రాఘవేంద్రావు, అనసూయ మాత్రమే కాదు, మిగిలిన వారంతా షాక్‌ అవుతున్నారు. రాఘవేంద్రరావు సినిమాలు చూస్తూ పెరిగిన తాను.. ఇప్పుడు ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు సుధీర్‌. ఈ చిత్రాన్ని థియేటర్లోనే చూసి ఆనందించాలని, మిగిలిన అన్ని సినిమాలను ఆదరించాలని తెలిపారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp