Anasuya : అన‌సూయ అంతలా రెచ్చ‌గొడుతుంది, కార‌ణం ఏంట‌మ్మ‌డు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : అన‌సూయ అంతలా రెచ్చ‌గొడుతుంది, కార‌ణం ఏంట‌మ్మ‌డు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :21 July 2022,7:30 pm

Anasuya: అన‌సూయ త‌న అంద‌చందాల‌తోనే విపరీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌ర‌చుకుంది. ఆమె సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్ట్‌ల కోసం జ‌నాలు ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. బుధ‌, గురు వారాల‌లో అన‌సూయ త‌ప్ప‌క త‌న ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఇవి నెటిజ‌న్స్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటాయి. తాజాగా స్టైలిష్ డ్రెస్‌లో వెరైటీ లుక్స్‌లో క‌నిపిస్తూ కుర్ర‌కారుకి కంటిపైకునుకు లేకుండా చేస్తుంది. అన‌సూయ మైండ్ బ్లోయింగ్ లుక్స్ తెగ వినోదాన్ని పంచుతున్నాయి. ఈ పిక్స్ చూసి నెటిజ‌న్స్ క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అన‌సూయ ఇటీవ‌ల టీవీ రంగానికి గుడ్ బై చెప్పి ఇక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రాధాన్యం ఇస్తుంద‌ట‌.

అందులో భాగంగానే తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో బోల్డ్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నారట. ‘జబర్దస్త్’కి దూరమైన అనసూయ వరుసగా సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఒప్పుకుంటున్నారు. ఓ వెబ్ సిరీస్‌లో అనసూయ, మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌లో కనిపించనుందని తాజా టాక్. ఇక్కడ విశేషం ఏమంటే.. ఈ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ దర్శకుడు క్రిష్ నిర్మిస్తున్నారు. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తన మార్క్ చూపిస్తూ వస్తోంది యాంకర్ అనసూయ.

anasuya stunning looks viral 2

anasuya stunning looks viral on instagram

Anasuya : క్యూట్ లుక్స్..

విలక్షణ పాత్రలతో సినిమాల పరంగా కూడా సూపర్ సక్సెస్ అనిపించుకుంది ఈ జబర్దస్త్ బ్యూటీ. దీంతో ఆమెకు వరుసపెట్టి సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే పదునైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ప్ర‌స్తుతం ద‌ర్జా అనే సినిమా చేస్తుంది. దర్జా ప్రీ రిలీజ్ వేడుకలో అందరి కన్ను అనసూయపైనే ఉంది. చీరకట్టులో అనసూయ గ్లామర్ ట్రీట్ చూసి కెమెరా కళ్లన్నీ అటువైపు గానే ఉన్నాయి. ఇక వేదికపై అనసూయ మాట్లాడిన తీరు ఆమె అభిమానులకు యమ కిక్కిచ్చింది. నా లైఫ్‌లో ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్ చేయించారని అనసూయ చెప్పింది. చీరతో విన్యాసాలు చేయించారు. గొడుగు తిప్పే సీన్ ఉంచారో లేదో నాకైతే తెలియదు కానీ.. సింగిల్ హ్యాండ్‌తో గొడుగు తిప్పించారని ఆమె చెప్పుకొచ్చారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది