Anasuya : వయ్యారాలు ఒలకబోస్తూ.. డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసిన అందాల అనసూయ
Anasuya : బుల్లితెరపై ఎంత మంది యాంకర్స్ సందడి చేసిన వారిలో అనసూయ స్పెషాలిటీ వేరే అనే చెప్పాలి. యాంకర్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే అందంతో పాటు హోస్టింగ్‌తో అలరించిన ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సందడి చేస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అందాల ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో తెగ సందడి చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ చూడీదార్‌లో తన వయ్యారాలన్నీ కనిపించేలే చిందులేసింది. అనసూయ క్యూట్ డ్యాన్స్‌కి కుర్రకారు పరవశించిపోతున్నారు.
అనసూయ మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ చూసి ఫిదా అవుతున్నారు. కొన్నేళ్లుగా అనసూయ భరద్వాజ్ బుల్లితెరపై పెద్దగా షోలు చేయడం లేదు. దీనికి కారణం ఆమె సినిమాలనే ఎక్కువగా ఒప్పుకోవడమే. ఇప్పటికే ఆమె ‘రంగమార్తాండ’, ‘వేదాంతం రాఘవయ్య’, ‘గాడ్ ఫాదర్’, ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప 2’, ‘భోళా శంకర్’ వంటి భారీ చిత్రాల్లో భాగమైంది. తద్వారా మరిన్ని భారీ ఆఫర్లను అందుకుంటూ హవా చూపిస్తోంది. ఇక కాంట్రవర్సీస్‌తో కూడా అనసూయ వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ఇటీవల ఆంటీ అంటూ తనను ట్రోలింగ్ చేసిన నెటిజన్లకు యాంకర్ అనసూయ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.

Anasuya stylish dance video viral
Anasuya : అదరహో అనిపించేలా..
అంతేకాకుండా వాళ్ల మీద పోలీస్ కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు చేయడంతో పాటు అప్పుడప్పుడూ స్పెషల్ సాంగ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ అనసూయ యమ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అలానే స్పెషల్ అకేషన్స్‌కి విషెస్ చెబుతూ ఉంటుంది. తన ఫ్యామిలీ విషయాలని కూడా షేర్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటుంది అందాల అనసూయ.
View this post on Instagram