Anasuya : సారీ అండి.. ఆ ఆలోచనే రాలేదు అనసూయ
Anasuya : అనసూయ బుల్లితెరపై, వెండితెరపై మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. జబర్దస్త్ యాంకర్‌గా అనసూయ తన అందాలతో అందరినీ కట్టిపడేస్తుంటుంది. అయితే అనసూయ వెండితెరపై మాత్రం అందాల ప్రదర్శనకు నో చెబుతుంది. ఇక్కడ అందాల ఆరబోత.. అక్కడ మాత్రం కేవలం ప్రతిభకు పదును పెట్టడమే అన్న నిబంధనతో ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తోంది.
అందుకే వెండితెరపై ఆమె ఎంచుకునే పాత్రలు అలానే ఉంటాయి. రీసెంట్‌గా పుష్ప సినిమాతో మరోసారి అనసూయ దుమ్ములేపేసింది. దాక్షాయణి లుక్కులో అనసూయ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇక ఆమె యాస, వేషధారణ, కట్టూబొట్టూ అన్నీ కూడా అందరినీ మెప్పించాయి. ఈ పాత్రలో ఎంతలా లీనమైందో అందరికీ అర్థమయ్యేలా అనసూయ చెప్పుకొచ్చింది.

Anasuya Taking Selfie With Allu Arjun
Anasuya : బన్నీపై అనసూయ కామెంట్
తాజాగా అనసూయ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేసింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ బన్నీతో దిగిన సెల్ఫీని పంపమని అడిగాడు. పుష్ప సినిమా సెట్‌లో సెల్ఫీ దిగుదామనే ఆలోచనే రాలేదండి.. సారీ.. మేం మా పాత్రల్లో బిజీగా మారిపోయాం.. ఈ సారి రెండో పార్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు కచ్చితంగా సెల్ఫీని తీసుకోవడానికి ట్రై చేస్తాను అని అనసూయ చెప్పుకొచ్చింది.