Anasuya : స్టైల్, ట్రెడిష‌న్ మిక్స్ చేసిన అన‌సూయ‌.. ఆ అందాల‌కు ఫిదా కావ‌ల్సిందే..!

Authored By Sam C | The Telugu News | Updated on : 2 April 2022, 10:46 am

Anasuya : బుల్లితెర‌కి గ్లామ‌ర్ అద్దిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ర్షించే అభిన‌యం ఈ ముద్దుగుమ్మ సొంతం. జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న అన‌సూయ భ‌ర‌ద్వాజ్ వెండితెర‌పై అడుగు పెట్టిన త‌ర్వాత వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ బిజీ న‌టిగా మారింది. పాజిటివ్ పాత్ర‌ల్లోనే కాదు, నెగిటివ్ పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ అంద‌రినీ మెప్పిస్తుంది. క్ష‌ణం చిత్రంలో గ్రే షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించారు. త‌ర్వాత రీసెంట్‌గా విడుద‌లైన పుష్ప ది రైజ్ చిత్రంలో దాక్షాయ‌ణి అనే పాత్ర‌లో గ్రే షేడ్స్ ఉన్న పాత్ర‌లో మ‌రోసారి అన‌సూయ మెప్పించే ప్ర‌య‌త్నం చేశారు.

న‌టిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న అనసూయ మరోసారి నెగటివ్ టచ్ ఉన్న పాత్ర‌లో కనిపించబోతున్నారు. ద‌ర్జా అనే సినిమాలో డిఫ‌రెంట్ రోల్ పోషిస్తుంది అన‌సూయ‌. ఇందులో సునీల్ కూడా న‌టిస్తుండ‌టం విశేషం. పుష్ప ది రైజ్‌లో భార్య‌, భ‌ర్త‌గా న‌టించిన అన‌సూయ‌, సునీల్ ఈసారి మాత్రం పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో న‌టిస్తుండ‌టం విశేషం. మ‌రి ఈ కొత్త సినిమా ద‌ర్జా అన‌సూయ‌కు ఎలాంటి గుర్తింపు తెస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక అన‌సూయ టీవీ, సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్నారు.

Anasuya Tradition new Pics In Viral

Anasuya Tradition new Pics In Viral

Anasuya : అన‌సూయ అందం అద‌ర‌హో…

త‌న సీరియ‌ల్స్‌, సినిమాలు, భ‌ర్త‌, పిల్ల‌లు ఫొటోలు, వీడియోల‌ను కూడా ఆమె షేర్ చేస్తుంటారు.తాజాగా ఉగాది స్పెష‌ల్ ఎపిసోడ్‌లో భాగంగా తాను ధ‌రించిన స్టైలిష్ డ్రెస్‌లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. ఇందులో అన‌సూయ చాలా క‌సిక‌సిగా చూస్తూ క‌నిపించింది. ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షోకి కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు. ఏదేమైన అన‌సూయ ఇటు బుల్లితెర అటు వెండితెర‌పై ర‌చ్చ లేపుతుంది. కత్తి లాంటి చూపులతో కుర్రాళ్ల గుండెల్ని కోస్తుంది. చిలిపి నవ్వుతో హార్ట్ బ్రేక్‌ చేస్తుంది. మొత్తంగా నెటిజన్లకి పిచ్చెక్కిస్తుందీ రంగమ్మత్త. ప్రస్తుతం అససూయ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి