Anasuya : ఎమ్మెల్యే కావాలని ఆశపడుతున్న అనసూయ..!
Anasuya : జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదనుంకుట.. అందం, అభినయంతో పాటు చూపు తిప్పుకోనివ్వని వాక్ఛాతుర్యం ఆమె సొంతం. మూడు పదుల వయస్సు దాటినా అనసూయ అందం అలాగే ఉంది. పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా అనసూయకు మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఆ అందాన్ని చూడకుండా ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్ షోలో అనసూయ వేసుకునే బట్టలకు, ఆమె అందాలకే రేటింగ్స్ వస్తున్నాయని కూడా టాక్ నడుస్తోంది. అందుకోసమే అనసూయ కోసం ప్రత్యేకంగా ఎంట్రీ సాంగ్ కూడా పెట్టారని తెలిసింది.హీరోయిన్లు సాధారణంగా సినిమా కెరీర్ పూర్తయ్యాక రాజకీయాల్లోకి అడుగు పెడుతుంటారు.
ప్రస్తుతం జబర్దస్త్ జడ్డిగా కొనసాగుతున్న రోజా యాక్టర్‌గా తప్పుకున్నాక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీలోని నగరి నియోజకవర్గానికి రోజా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. దీంతో పాటు సినిమాలు, కామెడీ , రియాలిటీ ప్రొగ్రామ్స్‌లోనూ పాల్గొంటారు. తాజాగా హైపర్ ఆదితో ఎంట్రీ సాంగ్‌లో స్టెప్పులేసిన అనసూయ తాను కూడా ఏదో ఒకరోజు రోజా లాగా ఎమ్మెల్యేను అవుతానని తన మనుసులోని మాటను బయటపెట్టింది. దీనికి వెంటనే కౌంటర్‌గా ఆది మాట్లాడుతూ.. నీకు ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్న గొడవలు చాలదా..? రాజకీయాల్లోకి అక్కడ కూడా గొడవలు పెట్టిస్తావా? అంటూ పంచ్ వేయడంతో అంతా నవ్వుకున్నారు.

anasuya who aspires to be an mla
Anasuya : సినిమాలతో పాటు రాజకీయాల్లోకి..
అనసూయ ఓవైపు జబర్దస్త్ షోలో యాంకర్‌గా చేస్తూనే ఇటీవల కాలంలో వరుసగా సినిమాలో అవకాశాలు కొట్టేస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో అనసూయ నటించగా.. రెండో భాగంలో దాక్షాయణి పాత్రలో అనసూయను కొత్తగా చూస్తారని చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమాలు, రియాల్టీ షోలు చేస్తూ ప్రస్తుతం బిజీగా మారిపోయిన అను బేబీ నిజంగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుందా..? అనేది భవిష్యత్తులో తేలాల్సి ఉంది.
