Anasuya : అనసూయ ఏంటి ఇలా తయారైంది.. మరీ ఇంత పొట్టి డ్రెస్సా.. వీడియో వైరల్
Anasuya : యాంకర్ అనసూయ పేరు చెప్పగానే మనకు ముందు గుర్తొచ్చేది జబర్దస్త్. అవును.. జబర్దస్త్ అనే షో లేకపోతే.. అనసూయ సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అయి ఉండేది కాదు. జబర్దస్త్ కంటే ముందు చాలా సినిమాల్లో అనసూయ కనిపించినా.. పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. సైడ్ క్యారెక్టర్లలో నటించినా.. తనకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ.. ఒక్క జబర్దస్త్ తో తనకు చాలా ఫేమ్ వచ్చింది.సెలబ్రటీ హోదాను జబర్దస్త్ అనసూయకు కట్టబెట్టింది. నిజానికి అనసూయ అందగత్తె. చాలా అందంగా ఉంటుంది. హైట్ ఎక్కువ. అందుకే తను జబర్దస్త్ యాంకర్ గా సూట్ అయింది.
జబర్దస్త్ స్టార్ట్ అయిన మొదట్లో అనసూయ ఎక్కువగా అందాలు ఆరబోసేది కాదు.కానీ.. ఎప్పుడైతే జబర్దస్త్ లోకి అనసూయ రీఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఇక చూసుకోండి.. తన అందాల ఆరబోతను జనాలు తట్టుకోలేకపోయారు. అప్పటి నుంచి తన గ్లామర్ షో స్టార్ట్ అయింది. ఈ మధ్య అను మరీ రెచ్చిపోతోంది. పొట్టి డ్రెస్సులు వేసుకొని వస్తోంది.నిజానికి.. ప్రస్తుతం అనసూయకు ఇండస్ట్రీలో చాలా డిమాండ్ ఉంది. ఓవైపు యాంకరింగ్.. మరోవైపు సినిమాలు.. అప్పుడప్పుడు సినిమా ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్ల నుంచి కూడా తనకు అవకాశాలు వస్తున్నాయి.

anchor anasuya short skirt video viral
Anasuya : మళ్లీ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చాక గ్లామర్ షో స్టార్ట్
ఈ మధ్య పొట్టి డ్రెస్సు వేసుకొని జబర్దస్త్ స్టేజీ మీద అలరించింది అనసూయ. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అనసూయకు ఏమైంది.. ఎందుకు అంత పొట్టి డ్రెస్ వేసుకొని యాంకరింగ్ చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు అయితే.. అను గ్లామర్ రోజురోజుకూ పెరుగుతోంది. తన అందం రహస్యం ఏంటో ఎవ్వరికీ అర్థం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తూ కుర్రకారు గుండెల్లో మాత్రం అను రైళ్లు పరిగెత్తిస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు.
