Anchor Pradeep : మళ్లీ ట్రాక్ ఎక్కిస్తున్నారుగా.. ప్రదీప్‌ను చూసి తెగ మెలికల్ తిరిగిన పూర్ణ
Anchor Pradeep బుల్లితెరపై అందరూ ఏదో ఒక ట్రాక్‌తో బతికి బట్టకడుతున్న వారే. కానీ ఒక్క ప్రదీప్ మాత్రం ఎలాంటి ట్రాకులో జోలికి వెళ్లకుండా తన సొంత టాలెంట్‌తోనే బతుకుతున్నాడు. ఇంకా నెట్టుకొస్తున్నాడు. లేడీ యాంకర్లలో సుమ ఎలాంటిదో.. మగ యాంకర్లలో ప్రదీప్ అలాంటి వాడు. మగవారు కూడా ఇలా యాంకరింగ్‌లో సక్సెస్ అవ్వొచ్చు అని చూపించాడు మన వాళ్లకు. అలాంటి ప్రదీప్ ఎక్కువగా కాంట్రవర్సీలకు, వివాదాల జోలకి వెళ్లడు.

Anchor Pradeep And Poorna In Thaggedele Diwali Special Event
ఈ పిచ్చి పిచ్చి రొమాంటిక్ ట్రాకులు కూడా ప్రదీప్‌కు సెట్ అవ్వవు. ఆ మధ్య అదిరింది, బొమ్మ అదిరింది అంటూ ప్రదీప్ శ్రీముఖి మధ్య ఏదో క్రియేట్ చేయాలని చూశారు. ఈ ఇద్దరి మీద ఏదో పిచ్చి ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేశారు. కానీ అది దారుణంగా బెడిసి కొట్టేసింది. ఇక ఢీ షోలో ఆ మధ్య పూర్ణ ప్రదీప్ మధ్య మంచి కెమిస్ట్రీని, ట్రాక్‌ను క్రియేట్ చేశారు. పూర్ణ కూడా బాగానే రెచ్చిపోయింది. ప్రదీప్‌తో వచ్చి డ్యాన్సులు కూడా వేసింది. ఇక ప్రదీప్ కూడా తప్పదన్నట్టుగా పూర్ణతో కానిచ్చేవాడు.
Anchor Pradeep ప్రదీప్ పూర్ణ ట్రాక్..

Anchor Pradeep And Poorna In Thaggedele Diwali Special Event
అయితే ఈ మధ్య అది కాస్త తక్కువైంది. కానీ పూర్ణ మాత్రం ఢీ కంటెస్టెంట్లు, మాస్టర్ల బుగ్గలు కొరకడం, ముద్దులు పెట్టడం మాత్రం మానదు. తాజాగా పూర్ణ దీపావళి ఈవెంట్లో మెరిసింది. తగ్గేదేలే అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో రోజా, పూర్ణ, ప్రియమణి, ఇంద్రజ, మన్నార్ చోప్రా వంటి వారు వచ్చారు. పూర్ణ ఎంట్రీనే శ్రీవల్లి అంటూ అదరగొట్టేసింది. ఇక అందులో ప్రదీప్ వంక చూస్తూ తెగ సిగ్గుపడింది. ఈ ఇద్దరూ కలిసి రొమాంటిక్ స్టెప్పులు కూడా వేసేశారు. మళ్లీ ఈ ట్రాక్‌ను పట్టాలెక్కించాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది.
