Rashmi Gautam : అది గుర్తు చేసి మరి పరువుతీస్తున్నాడు.. రష్మీని ఆడుకుంటోన్న ప్రదీప్
Rashmi Gautam యాంకర్ ప్రదీప్ తన హోస్టింగ్‌తో అందరినీ అలరిస్తుంటాడు. తన స్పాంటేనిటితో అందరి మీద అదిరిపోయే పంచ్‌లు వేస్తుంటాడు. ఇక ఇమిటేషన్‌లో అయితే ప్రదీప్ వేరే లెవెల్. అందరినీ దారుణంగా ఇమిటేట్ చేసి పరువుతీస్తుంటాడు. తాజాగా ఢీ ప్రోమోను రిలీజ్ చేశారు. వచ్చే వారం రాబోతోన్న ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలోను రష్మీని ప్రదీప్ ఆడుకున్నాడు.

Anchor Pradeep Fun With Rashmi Gautam
రష్మీ ఈ మధ్య కాలంలో జీతెలుగు చానెల్‌లోని ఓ ఈవెంట్‌లో పాల్గొంది. అక్కడ రష్మీ వేసిన స్టెప్పులు, తన నడుమును వెరైటీగా తిప్పడం నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అదొక ఐకానికి స్టెప్‌ల మారిపోయింది. అయితే దాన్ని అందరూ వేస్తూ.. రష్మీని ఇమిటేట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్స్ అంటూ ఢీ ఎపిసోడ్‌ను హైలెట్ చేశారు.
Rashmi Gautam రష్మీపై ప్రదీప్ కామెంట్లు..

Anchor Pradeep Fun With Rashmi Gautam
ఈ ఎపిసోడ్‌కు కలర్ ఫోటో హీరో సుహాస్ ఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయే డ్యాన్స్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. సోహెల్ అయితే రష్మీ, దీపికల మధ్యలో సెటిల్ అయ్యాడు. చివర్లో ఈ ముగ్గురు కలిసి స్టెప్పులు వేశాడు. చివరకు రష్మీ తన ఐకానికి స్టెప్ వేసింది. దాన్ని ప్రదీప్ దారుణంగా అనుకరించాడు. దీంతో రష్మీ పగలబడి నవ్వేసింది. మొత్తానికి రష్మీ స్టెప్ మాత్రం అందరికీ అలా గుర్తుండిపోయింది.
